Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తోంది. మనీశ్ సిసోడియా నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరకు అంతా జైల్లోనే ఉన్నారు. అయినా పాలన సాగుతోంది.. కేజ్రీవాల్ జైలు నుంచే రూల్ చేస్తున్నారు. ఇలా అవినీతి కేసులో సీఎంగా ఉండగానే అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే.. ఇలా జైలు నుంచే ప్రజలను పాలిస్తున్న నేత కూడా ఆయనే. ఇక ఈ కేసులో తర్వాతి అరెస్ట్ ఎవరిదన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల ప్రారంభంలోపు మరో నలుగురు ఆప్ కీలక నేతలు అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో రాఘవ్ చద్దా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
Also Read: భూకంపం వస్తే ఇలా జాగ్రత్తగా ఉండండి..!
రాఘవ్ చద్దా ఎక్కడున్నారు?
రాఘవ్ చద్దా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారని సమాచారం. విట్రెక్టమీ కోసం తన భార్య పరిణీతి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారట. విట్రెక్టమీ అనేది కంటిలోని రెటీనా నిర్లిప్తతను నివారించడానికి నిర్వహించే ఒక రకమైన శస్త్రచికిత్స. అయితే రాఘవ్ చద్దా భయంతోనే లండన్ వెళ్లిపోయారని బీజేపీ ఆరోపిస్తోంది. నిజానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో చద్దా పేరును ప్రస్తావించింది, అయితే ఏజెన్సీ ఆయన్ను ప్రశ్నించడానికి పిలవలేదు. తనను, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలను కొద్దీ రోజుల్లో ఈడీ అరెస్టు చేస్తుందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి ప్రకటించడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఆప్ నాయకులందరూ మీడియాకు కనిపిస్తుండగా.. చద్దా మాత్రం కనిపించడంలేదు.