Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ రోజే కోర్టుకు వస్తా: కేజ్రీవాల్! ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ సమన్లు, కోర్టుకు రాకపోవడానికి గల కారణాలను చెప్పారు. తదుపరి విచారణ(మార్చి 16)లో తానే కోర్టుకు భౌతికంగా హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు. By Trinath 17 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Kejriwal Attended Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు రోస్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కోర్టుకు హాజరయ్యారు. బడ్జెట్ సెషన్ కారణంగా కేజ్రీవాల్ భౌతికంగా హాజరు కాలేకపోయారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కోసం కోర్టు తదుపరి తేదీని మార్చి 16గా ఇచ్చింది. కోర్టులో విచారణ సందర్భంగా కేజ్రీవాల్ ఓ విషయాన్ని స్పష్టం చేశారు. తదుపరి విచారణలో తానే హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు. వేటిపై ప్రశ్నించనున్నారు? ఐదు అంశాల ప్రాతిపదికన అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించాలనుకుంటున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. దర్యాప్తులో ఐదు పాయింట్లు ప్రధానంగా ఉన్నాయి. అందులో ప్రధానమైనది నేరాల ప్రక్రియలో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 338 కోట్లు ఎలా చేరాయి? ఇక నిజానికి మనీష్ సిసోడియా బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.338 కోట్ల మనీ ట్రయల్‌ను కోర్టు ముందు ఉంచింది. ఇందులో ఎక్సైజ్ పాలసీ సమయంలో మద్యం మాఫియా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.338 కోట్లు చేరినట్లు రుజువైంది. ఇక కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో సమావేశం కూడా జరిగిందని ఈడీ తెలిపింది. నాల్గవ అంశం ఏమిటంటే, ఎక్సైజ్ పాలసీలో 6శాతం మార్జిన్ లాభం ఉందని, కేజ్రీవాల్ ఆమోదంతో మాత్రమే 12శాతానికి పెంచామని మనీష్ సిసోడియా అప్పటి కార్యదర్శి సి అరవింద్ విచారణ సందర్భంగా చెప్పారు. అంటే ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందని ఈడీ భావిస్తోంది. ఇది కాకుండా, కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జరిగిన కేబినెట్ సమావేశాన్ని కేజ్రీవాల్ నిర్వహించారు. ఈ అంశాలపై అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ విచారించాలని కోర్టును కోరుతోంది. Also Read: అమృతబాల్.. పిల్లల కోసం ఎల్ఐసీ అదిరిపోయే కొత్త పాలసీ WATCH: #arvind-kejriwal #delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి