Arvind Kejriwal arguing his own case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో తన వాదనలను బలంగా వినిపించారు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ కేజ్రీవాల్ ఏం అన్నారు?
ఇది తప్పుడు కేసు:
ఈడీ కేసు నిరాధారమైనదన్నారు కేజ్రీవాల్. ఇది రాజకీయ ప్రోద్బలం కేసు అని కోర్టులో వాదించారు. దేశం మొత్తం వినడానికి తన స్టేట్‌మెంట్‌ను తానే చదువుతున్నానన్నారు కేజ్రీవాల్. దాదాపు ఆరు నెలలుగా ఈ కేసు నడుస్తోందని.. ఆగస్టు 17, 2022లో సీబీఐ తొలిసారి కేసు నమోదు చేసిందన్నారు కేజ్రీవాల్. ఆగస్టు 22, 2022న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదైందన్నారు. తనను దోషిగా ఏ కోర్టు నిర్థారించలేదన్నారు కేజ్రీవాల్. తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు. సీబీఐ దాదాపు 31 వేల కోర్టు ఫైల్స్ దాఖలు చేసిందని.. దాదాపు 294 మంది సాక్ష్యులను విచారించిందన్నారు. ఈడీ 25 వేల పేజీలు ఫైల్ చేసిందని చెప్పారు. దాదాపు 162 మంది సాక్ష్యులను విచారించిందని..
తనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదన్నారు కేజ్రీవాల్. అన్ని సాక్ష్యాలు, డాక్యుమెంట్లలో కేవలం 4 చోట్ల మాత్రమే పేర్కొన్నారన్నారు.
ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఎలా?
తన సమక్షంలోనే మనీష్ సిసోడియాకు ఎక్సైజ్ పాలసీ పత్రాలను సమర్పించారన్నారు కేజ్రీవాల్. ఎక్కడా డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు చేయలేదని.. తన ఇంటికి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కార్యదర్శులు వస్తుంటారని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడానికి ఈ ఒక్క స్టేట్‌మెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు కేజ్రీవాల్. ఇక శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబింద ఫార్మా ఎలక్టోరల్ బాండ్లను కూడా ఆయన ప్రస్తావించారు. మాగుంట రెడ్డి, అతని కుమారుడు EDకి 6 స్టేట్‌మెంట్‌లు ఇచ్చారని.. శరత్ రెడ్డి 9 స్టేట్‌మెంట్లు ఇచ్చారని.. ఒక్కదానిలోనూ తన పేరు లేదన్నారు కేజ్రీవాల్. మరోవైపు కేజ్రీవాల్ రిమాండ్‌ను కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌కి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది.
Also Read: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్