దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో మరోసారి ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పెద్దపెద్ద తలకాయాలకు సమన్లు జారి చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసారి ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీకాల్(Arvind Kejriwal)కు సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది. డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. .
కేజ్రీవాల్‌ను గతంలోనే ప్రశ్నించిన ఈడీ:
ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్‌సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచిన సీబీఐ ఆ తర్వాత అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా తొమ్మిది గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో మద్యం పాలసీని రద్దు చేశారు.
ఆప్ చుట్టూనే కేసులు:
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటి నుంచి ఆమ్ ఆద్మి పార్టీ చుట్టూనే తిరుగుతోంది. మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌తో పాటు ఎంపీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత అక్టోబర్‌లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో కేంద్ర ద్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలే ఇందుకు ఉదాహరణ. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న అనుమానంతోనే సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఈడీ అధికారులు. దీంతో పాటు బిజినెస్ మ్యాన్ దినేశ్ అరోరాతో కూడా సంజయ్ కు సంబంధాలున్నట్లు ఈడీ అప్పుడే గుర్తించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్ర రెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు అప్రూవర్లుగా మారి కీలక సమాచారాలు అందించారు.
Also Read: 35 లక్షల తో పాటు పల్లవి ప్రశాంత్ పొందిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవే..!
WATCH: