Viral Video : ఆలయంలో కూలిన స్టేజీ.. ఒకరు మృతి, 17 మందికి గాయాలు!

ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. జనవరి 27-28 అర్ధరాత్రి, మహంత్ కాంప్లెక్స్, కల్కాజీ మందిర్‌లోని మాతా జాగరణ్‌లో చెక్క, ఇనుప ఫ్రేమ్‌తో చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు.

New Update
Viral Video : ఆలయంలో కూలిన స్టేజీ.. ఒకరు మృతి, 17 మందికి గాయాలు!

Delhi Temple Stage Collapse : ఢిల్లీ(Delhi) లోని కల్కాజీ టెంపుల్‌(Kalkaji Mandir) లో జాగరణ సందర్భంగా వేదిక కూలిపోయింది. స్టేజీ కూలడంతో 17 మందికి గాయాలయ్యాయి. ఒక మహిళ మృతి చెందింది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గాయకుడు ప్రాక్ ఈ జాగ్రన్‌కు వచ్చాడు. అతన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇంతలో ప్రాక్ వేదికపై తన ప్రదర్శనను ప్రారంభించాడు, ఆ వెంటనే వేదిక కూలిపోయింది. తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది.


ఎందుకిలా జరిగింది?
ప్రజలు వేదిక వైపు కదులుతుండగా, ఆలయ అధికారులతో పాటు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు అదేపనిగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ మహిళ(A Women) వేదిక కిందే సమాధి అవ్వడం అక్కడున్నవారిని కలిచివేసింది. స్థానికుల సహకారంతో వేదిక కింద చిక్కుకునన వారిని పోలీసులు బయటకు తీశారు. ప్రాక్‌తో పాటు అతని బృందాన్ని సురక్షితంగా తరలించారు.


పోలీసుల కథనం ప్రకారం, జనవరి 27-28 అర్ధరాత్రి మహంత్ కాంప్లెక్స్(Mahant Complex), కల్కాజీ టెంపుల్ వద్ద మాతా జాగరణ సందర్భంగా చెక్క, ఇనుప ఫ్రేమ్‌తో చేసిన ప్లాట్‌ఫారమ్ కూలిపోయింది. నిజానికి కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదుని సమాచారం. దాదాపు 1500-1600 మంది ఒకే చోట గుమిగూడారు. ఘటనా స్థలాన్ని క్రైమ్‌ బృందం సందర్శించింది. గాయపడిన మిగతా వారందరి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వ్యవహారంలో నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 337/304A/188 కింద కేసు నమోదు చేశారు.

Also Read: బీఆర్ఎస్ ఆఫీసులో కూల్చివేతలు!

WATCH:

Advertisment
తాజా కథనాలు