జలదిగ్భంధనంలో ఢిల్లీ, కొనసాగుతున్న యమునానది ఉధృతి

దేశ రాజధానిలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 16 వరకు ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసర వస్తువులను రవాణా చేసే వాహనాలు మినహా భారీ వాహనాలను రాజధానిలోకి రాకుండా అధికారులు బ్యాన్ విధించారు.

New Update
జలదిగ్భంధనంలో ఢిల్లీ, కొనసాగుతున్న యమునానది ఉధృతి

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలకు తోడు యమునా నది ఉప్పోంగి ప్రవహిస్తుండటంతో హస్తీన వీధులన్నీ భారీ వరదలమయమయ్యాయి. నిన్న యమునా నది నీరు ఎర్రకోట గోడల వద్దకు పోటెత్తడంతో నేడు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేకుండా మూసేస్తున్నామని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. నిన్న మధ్యాహ్నం నుంచే ఎర్రకోటను మూసేస్తున్నట్టు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తమ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జూలై 16 వరకు మూసే ఉంటాయని ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకునట్లు విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారు.

Delhi in water crisis, ongoing Yamuna River upheaval

రోడ్లన్ని కాల్వులే

అయితే ఢిల్లీలో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక స్థాయిలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 45 ఏళ్ల చరిత్రలో 208.62 మీటర్ల ఎత్తుకు యమునా ప్రవాహం చేరుకోవడం ఇదే తొలిసారి అని రికార్డులు చెబుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శరద్‌చంద్ర మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ సాయంత్రం 4 గంటల సమయానికి హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్‌లో నీటి ప్రవాహం 80 వేల క్యూసెక్కులకు తగ్గినట్టు తెలిపారు. ఇవాళ తెల్లవారుజాము 3 గంటల సమయానికి ప్రాజెక్టులోకి వరద ఉధృతి ఇంకొంత తగ్గే అవకాశం ఉందన్నారు.

దేశ రాజధాని మొత్తం వరదలమయమైన నేపథ్యంలో అత్యవసర వాహనాలు, నిత్యావసర సరుకులతో వెళ్లే వాహనాలు తప్పించి ఢిల్లీలోకి భారీ వాహనాలను అనుమతించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీకి దారితీసే నాలుగు మార్గాల్లోనూ చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసి ఆంక్షలు అమలు చేస్తోంది. రోడ్లపైకి వస్తోన్న వరద నీటితో ఇప్పటికే నగరం నలుమూలలా ట్రాఫిక్ స్తంభిస్తోంది. అత్యవసర పనులపై బయటికొచ్చిన వాహనదారులు సైతం ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని అవస్తలు పడుతున్నారు.

Delhi in water crisis, ongoing Yamuna River upheaval

వరద బీభత్సంతో ట్రాఫిక్ జామ్

ఢిల్లీలో వరదల ప్రభావం ఢిల్లీ మెట్రో సేవలపై సైతం స్పష్టంగా కనిపిస్తోంది. యమునా నదిని ఆనుకుని ఉన్న యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌లో మెట్రో ప్రయాణికులకు ఎంట్రీ, ఎగ్జిట్ మూసేశారు. ఢిల్లీలో మొత్తం నాలుగు చోట్ల ఢిల్లీ మెట్రో యమునా నదిని దాటాల్సి ఉంది. అయితే, ముందస్తు జాగ్రత్తగా యమునా బ్రిడ్జిల క్రాసింగ్ వద్ద గంటకు 30 కిమీ వేగం మించకుండా మెట్రో రైలును నడిపిస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

publive-image

ప్రరిస్థితి మోదీ ఆరా

రెండు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. యమునా నది వరదల నేపథ్యంలో ఢిల్లీలో పరిస్థితిపై ఆరా తీసినట్లు వెల్లడించింది. ఈమేరకు రాత్రి పీఎంవో ఓ ట్వీట్ చేసింది. మరో 24 గంటల్లో యమునా నది నీటిమట్టం తగ్గే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను మోహరించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారని పేర్కొంది. వరదలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నట్లు అమిత్ షా ప్రధానికి తెలిపారు. అవసరమైతే ప్రజలను వేగంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారని తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు