CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈడీ అరెస్ట్‌ను సమర్థిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
New Update

Chief Minister Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈడీ అరెస్ట్‌ను సమర్థిస్తూ.. కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కీంలో కేజ్రీవాల్ పాత్ర ఉందిని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది.

ALSO READ: సీఎం రేవంత్‌కు వరుస ప్రమాదాలు.. కారణమేంటి?.. కుటుంబ సభ్యుల ఆందోళన

టికెట్ల కేటాయింపు, ఎలక్టోరల్‌ బాండ్స్‌కు ఈ విచారణతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. చట్టం ముందు పేద పెద్ద అనే తేడా  ఉండదని.. చట్టం ముందు అందరు సమానమే అని పేర్కొంది.లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. మొదటగా కేజ్రీవాల్ కు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది.. ఆ తరువాత మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ నెల 1వ తేదీన ఈడీ.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని తద్వారా మద్యం కుంభకోణం కేసులో అనేక విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు విన్నపించుకోగా.. ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించింది.

#chief-minister-arvind #cm-kejriwal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe