CM Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. సీబీఐకి నోటీసులు

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.

CM Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. సీబీఐకి నోటీసులు
New Update

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మధ్యంతర బెయిల్ పై విడుదల..

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉంటున్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటికి వచ్చారు. బెయిల్ గడువు ముగిశాక మళ్లీ జైలు అధికారులకు లొంగిపోయారు. అయితే, తనకు ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి తెల్సిందే.

#cm-kejriwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe