Delhi Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు సజీవ దహనం!

ఢిల్లీ లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.

Delhi Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు సజీవ దహనం!
New Update

Fire Accident: ఢిల్లీ (Delhi) లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సాయంత్రం మంటలు చెలరేగాయి. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. మంటలు చెలరేగిన భవనం నాలుగు అంతస్తులదని పోలీసులు తెలిపారు.

షార్ట్ సర్క్యూట్ వల్ల..

మొదటి, రెండో అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. భవనంలో వివిధ కుటుంబాలు నివసిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ రూమ్ హీటర్ వల్ల కానీ మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, పితాంపుర జిల్లా పరిషత్ బ్లాక్ నుండి రాత్రి 8 గంటలకు అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందని, ఎనిమిది ఫైర్ టెండర్లను సేవలో ఉంచామని అగ్నిమాపక అధికారులు తెలిపారు.మంటలను అదుపులోకి తెచ్చామని, శీతలీకరణ చర్యలు కొనసాగుతున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి తెలిపారు.

మహిళ అనుమానాస్పదంగా..

అగ్ని ప్రమాదంపై మరో వార్త వెలుగులోకి వచ్చింది. గురువారం (జనవరి 18) రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కదులుతున్న కారులో వెనుక భాగం మంటల్లో చిక్కుకోవడంతో ఒక మహిళ అనుమానాస్పదంగా మరణించింది. మహిళ భర్త సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు.

న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రకారం, పోలీస్ స్టేషన్ ఆఫీసర్ జబ్బర్ సింగ్ మాట్లాడుతూ, కారు డ్రైవర్ అశోక్ పటేల్ (30) తన భార్య పరమేశ్వరి పటేల్ (26)తో కలిసి సెండా గ్రామ సమీపంలోని అజనీ మాత ఆలయానికి వెళుతుండగా, అకస్మాత్తుగా వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. దీని కారణంగా మహిళ  మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా కారు వెనుక సీటుపై సగం కాలిపోయిన మహిళ మృతదేహం కనిపించిందని తెలిపారు. పరమేశ్వరి తండ్రిని ప్రాథమిక విచారించగా ఆమె ఉదయం పెహార్ నుండి తన భర్త వద్దకు వెళ్లినట్లు అతను చెప్పాడు.

కేసు అనుమానాస్పదంగా కనిపించడంతో, జోధ్‌పూర్ నుండి ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని పిలిపించామని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం బంగర్ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మహిళ మృతికి అసలు కారణాలు వెల్లడవుతాయని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు.

Also read: ఇక నుంచి నగరంలో ఉదయం, సాయంత్రం హెవీ వెహికల్స్‌ కు నో పర్మిషన్‌!

#delhi #fire-accident #6-died
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe