Delhi Liquor Case: లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాకు షాక్..కస్టడీని పొడిగించిన కోర్టు..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు జీవితం అనుభవిస్తున్న ఆప్ సీనియర్ నేత, మనీష్ సిసోడియాకు షాక్ ఇచ్చింది కోర్టు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని..జైలు నుంచి రిలీజ్ అవుతానని పేర్కొన్న కొన్ని గంటల్లోనే కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.ఆయన కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..మనీశ్ సిసోడియా ఆస్తులు ఆటాచ్ చేసిన ఈడీ..!!
New Update

Delhi Liquor Case:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ మధ్యే ఆప్ నేషనల్ కన్వీన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్టు అయిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడయా కూడా అరెస్టు అయ్యారు. ఇదే కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలలో ఉన్న సంజజ్ సింగ్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరికొంతమంది ఆప్ నేల పేర్లు కూడా విచారణలోబయటకు వచ్చినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మొదట అరెస్టు అయిన మనీష్ సిసోడియా తాను త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గట్టి షాకిచ్చింది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.

సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 18వరకు పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను హాజరుపరిచారు. స్పెషట్ జడ్జీ కావేరీ బవేజా, కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో వాదనలు వినిపించిన సిసోడియా, లిక్కర్ స్కాంలో తన ప్రమేయాన్ని కేంద్ర ఏజెన్సీ ఈడీ, సీబీఐలు ఇంకా రుజువు చేయలేదన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ తరపున మొదట అరెస్టు అయ్యింది మనీష్ సిసోడియానే. 2023 ఫిబ్రవరి 26వ తేదీన ఈ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీ మంత్రి వర్గం నుంచి తప్పుకున్న సిసోడియా, తన ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2023 అనంతరం మార్చి 9వ తేదీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు కూడా మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఎన్నిసార్లు ప్రయత్నించినా మనీష్ మాత్రం బెయిల్ దొరకడం లేదు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మేనిఫెస్టో.. ముస్లిం లీగ్‌ భావజాలాన్ని పోలి ఉంది: మోదీ

#ed-arrests #delhi-liquor-case #delhi-liquor-scam-manish-sisodia
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe