Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో సారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

Delhi Chief Minister Arvind Kejriwal: లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లిక్కర్ స్కాం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ తీర్పును వెల్లడించింది. కాగా ఏప్రిల్ 23న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు మే 7వరకు కస్టడీని పొంగించింది. నేటితో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.

మార్చి 21 నుంచి జైలులోనే..

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను మార్చి 21 రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా ఏప్రిల్ 10న ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. గోవా ఎన్నికల కోసం కేజ్రీవాల్‌కు డబ్బు ఇచ్చారని పేర్కొంటూ ఈడీ తగినంత ఆధారలను, ఆమోదించేవారి ప్రకటనలను, ఆప్ యొక్క స్వంత అభ్యర్థిని ఉంచగలిగిందని గమనించిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్ ను కొట్టిపారేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు