CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

CM Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కాగా నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. అలాగే ఈ కేసులో బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం ద్వారా అతను కేసులోని కీలక విషయాలను, ఆధారాలను మార్చుతారని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో పురోగతి వచ్చేందుకు తమకు కేజ్రీవాల్ ను విచారించేందుకు మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. ఈడీ వాదనలకు సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు