Delhi CM Arvind Kejriwal Arrested: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 4గంటల పాటు కేజ్రీవాల్ ను విచారించిన అనంతరం అరెస్టు చేసింది. కాగా మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోపాటు తదితరులను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించింది. అక్కడే సీఎం కేజ్రీవాల్ కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 22( శుక్రవారం) పీఎంఎల్ఏ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరచనున్నారు. కోర్టుకు హాజరుకాకుముందే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్ఎంఎల్ అసుపత్రి బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అప్‌లోడ్ చేసిన ఈసీ