Delhi Chalo : రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఢిల్లీ చలోపై ఉత్కంఠ!

ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. 200 రైతు సంఘాలు, పెద్ద సంఖ్యలో రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి చేరుకోనుంది. అసలు రైతుల డిమాండ్లు ఏంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Delhi Chalo : రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఢిల్లీ చలోపై ఉత్కంఠ!

Farmers Demands : రైతుల నిరసన పిలుపుతో పోలీసులు CrPC Section 144 కింద మంగళవారం నుంచి ఒక నెల పాటు ఆంక్షలు విధించారు. ఎలాంటి చట్టవిరుద్ధమైన సమావేశాలను నిషేధించారు. రిజర్వ్ బలగాలతో సహా దాదాపు 10,000-15,000 మంది పోలీసులను సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో మోహరించారు. వాయువ్య ఢిల్లీ(Delhi) లోని బవానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. జైలు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందిందని తెలుస్తోంది.


దాదాపు 200 రైతు సంఘాలు, పెద్ద సంఖ్యలో రైతులు నిర్వహిస్తున్న 'ఢిల్లీ చలో మార్చ్' ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి చేరుకోనుంది.

Also Read : Gold Rate Today : బంగారం ధరల్లో మార్పులేదు.. వెండి మాత్రం.. ఈరోజు ఎంత ఉందంటే..

రైతుల ప్రధాన డిమాండ్లు:
--> స్వామినాథన్(Swaminathan) నివేదిక ప్రకారం అన్ని పంటల MSPకి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్.

--> రైతులు, రైతు కూలీల రుణమాఫీ చేయాలని డిమాండ్‌.

--> లఖింపూర్ ఖేరీ(Lakhimpur Keri) లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని, ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయడం ద్వారా దోషులందరినీ శిక్షించాలని డిమాండ్.

--> లఖింపూర్ ఖేరీ ఘటనలో గాయపడిన రైతులందరికీ రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్.

--> ఉద్యమ సమయంలో నమోదైన కేసును రద్దు చేయాలని డిమాండ్‌.

--> గత ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులపై ఆధారపడిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి.

--> MNREGA కింద 200 రోజుల రోజువారీ వేతనం ఇవ్వాలి.

--> రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

--> ప్రభుత్వమే పంటల బీమా చేయించాలి.

--> రైతులు, కూలీలకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.10వేలు ఇవ్వాలి.

--> ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వ్యవసాయాన్ని తొలగించాలి.


Also Read: నిరుద్యోగులకు అలెర్ట్.. 290 లెక్చరర్ల పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు!

WATCH:

Advertisment
తాజా కథనాలు