Annabel Sutherland: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2024) వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ జాక్‌పాట్ కొట్టింది. ఇటీవల అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్న సదర్లాండ్‌ను రూ. 2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) దక్కించుకుంది.
బేస్ ప్రైస్ రూ.40 లక్షలతోనే వేలంలోకి వచ్చిన ఈ ఆసిస్ యువ ఆల్‌రౌండర్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు ఫ్రాంచైజీలన్నీ పోటీ పడ్డాయి. ఎలాగైనా కొనుగోలు చేసేందుకు కాసుల వర్షం కురిపించాయి. సదర్లాండ్ ను కొనుగోలు చేసేందుకు ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
ఇది కూడా చదవండి: ఆక్షనీర్ గా ఆకర్షిస్తున్న మల్లికా సాగర్..నెట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు
చివరికి ముంబై కాస్త వెనక్కు తగ్గడంతో అన్నాబెల్ సదర్లాండ్ ను ఢిల్లీ కేపిటల్స్ జట్టు సొంతం చేసుకుంది. సదర్లాండ్ గత వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. తొలి వేలంలో ఈ ఆల్‌రౌండర్‌ను ఆ జట్టు రూ. 70 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే వచ్చే సీజన్‌కు ముందు గుజరాత్ తనను విడిచిపెట్టడంతో ఆమెను దక్కించుకునేందుకు రెండు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఆమెను ఢిల్లీ భారీ ధరకు దక్కించుకుంది. సదర్లాండ్ ఇప్పుడు అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవలి మహిళల బిగ్ బాష్ లీగ్‌లోనూ అదరగొట్టింది. ఆ టోర్నీలో 304 పరుగులు చేయడంతో పాటు 21వికెట్లు పడగొట్టింది.