Delhi Crime: క్యాబ్ డ్రైవర్ తో గొడవ..200 మీటర్లు ఈడ్చుకెళ్లిన దుండగులు! ఢిల్లీ(Delhi) లో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. క్యాబ్ డ్రైవర్ (Cab driver) పై కొందరు దుండగులు దాడి చేసి 200 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసిన ఘటన వెనుక వచ్చే కార్ లో ఉన్న కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Bhavana 11 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ(Delhi) లో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. క్యాబ్ డ్రైవర్ (Cab driver) పై కొందరు దుండగులు దాడి చేసి 200 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసిన ఘటన వెనుక వచ్చే కార్ లో ఉన్న కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాధితుడు అర్థరాత్రి నడి రోడ్డు పై నిర్జీవంగా పడి ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరియాబాద్ కి చెందిన బిజేంద్ర క్యాబ్ నడుపుతుంటాడు. ఆ క్యాబ్ పై కొందరు దుండగులు దాడి చేశారు. కారును ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారు. ఆ సమయంలో వారితో బిజేంద్ర గొడవపడ్డాడు. దీంతో దుండగులు బిజేంద్ర మీద తీవ్రంగా గాయపరిచారు. Alsoread: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఆ నలుగురు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..! అయినప్పటికీ బిజేంద్రకి పట్టు వదలకుండా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో దుండగులు బిజేంద్రను కారుతో గట్టిగా ఢీకొట్టారు. దాంతో బిజేంద్ర కార్ వెనుకాల చిక్కుకున్నాడు. అయినా సరే దుండగులు బిజేంద్రను పట్టించుకోకుండా 200 మీటర్ల వరకూ అలానే లాక్కుని వెళ్లారు. అలా వెళ్లిన తరువాత బిజేంద్ర రోడ్డు పై పడిపోయాడు. అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన బిజేంద్రను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుల కోసం గాలిస్తున్నారు. జనవరి 1 న కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంజలి అనే యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలో మీటర్లు ఈడ్చకెళ్లింది. ఈ ఘటనలోనూ బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులైన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. What’s happening in Delhi? #DisturbingVideo #Delhi pic.twitter.com/eTa2fG3dB0— Navdeep Singh (@wecares4india) October 11, 2023 #delhi #crime #cab-driver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి