విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు.. CPR చేసి బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ విమానంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యులు ప్రయాణిస్తున్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి పరిస్థితిని గమనించారు. చిన్నారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్‌తోనే పాప సాధారణ స్థితికి వచ్చే వరకు వైద్యులు శ్రమించారు.

విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు.. CPR చేసి బతికించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు
New Update

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌లో ఓ రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఆ విమానంలోనే ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు వైద్యులు ప్రయాణిస్తున్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారి పరిస్థితిని గమనించారు. అప్పటికే పల్స్ పడిపోయి.. చిన్నారి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. శ్వాస ఆగిపోయి అపస్మాకర స్థితిలోకి వెళ్లింది. వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో దించాలని పైలట్‌కి చెప్పారు. అప్పటివరకు చిన్నారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్‌తోనే పాప సాధారణ స్థితికి వచ్చే వరకు వైద్యులు శ్రమించారు.

అదే సమయంలో పాపకు గుండెపోటు వచ్చిందని గుర్తించి 45 నిమిషాల పాటు CPR చేశారు. ఈలోపే ఫ్లైట్‌ నాగ్‌పూర్‌కి చేరుకోవడంతో వెంటనే చిన్నారిని పీడియాట్రిషియన్‌కి అప్పగించారు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. ఈ ఘటనను ఢిల్లీ ఎయిమ్స్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. సీనియర్ అనస్థీషియన్ డాక్టర్ నవదీప్ కౌర్, సీనియర్ కార్డియాక్ రేడియాలజిస్ట్ డాక్టర్ దమన్ దీప్ సింగ్, ఎక్స్ సీనియర్ ఎయిమ్స్ రేడియాలజిస్ట్ డాక్టర్ రిషబ్ జైన్, సీనియర్ ఓబీజీ డాక్టర్ ఓషికా, సీనియర్ కార్డియాక్ రేడియాలజిస్ట్ డాక్టర్ అవిచలా టాక్సాక్ ఈ వైద్య బృందంలో ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రెండేళ్ల చిన్నారిని కాపాడిన డాక్టర్లను అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe