/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/sanjay-singh-bail-jpg.webp)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు (Excise Policy Scam Case) సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు (AAP MP Sanjay Singh) సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. ఆయనకు బెయిల్ లభించింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంజయ్ సింగ్ ప్రచారంలోనూ పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. సంజయ్ సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి:National: జయ్‌శంకర్ కు కౌంటర్ ఇచ్చిన చిదంబరం..రాజకీయ రంగులు అద్దుకుంటున్న కచ్చతీవు అంశం
లిక్కర్ స్కామ్ తయారీ, అమలులో ఆయనది ప్రధాన పాత్ర అని చెబుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 4న ఆయనను అరెస్ట్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల లభించడంతో దాదాపు ఆరు నెలల తర్వాత బయటకు వస్తున్నారు.
सत्यमेव जयते https://t.co/meS9tQN5fb
— Atishi (@AtishiAAP) April 2, 2024
ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే.. తాజాగా సంజయ్ సింగ్ కు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా ఆప్ మంత్రి అతిషి 'సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు.