Defence Minister Rajnath Singh: రిజర్వేషన్ల అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన తమకు లేదు. మన రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదు. మతాల ఆధారంగా ఎలాంటి రిజర్వేషన్ కల్పించబడదు. ప్రస్తుత రిజర్వేషన్లు (Reservations) కొనసాగుతాయని, ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. "ప్రతిపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి... భారత రాజకీయాల్లో విశ్వాస సంక్షోభం సృష్టించడానికి కాంగ్రెస్ (Congress), దాని మిత్రపక్షాలే బాధ్యత వహిస్తాయి" అని ఆయన అన్నారు.
ALSO READ: భారతదేశ ఆర్థిక వృద్ధి @6.9 శాతం: ఐక్యరాజ్యసమితి అంచనా
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “రాజ్యాంగంలో (Constitution) అత్యధిక సంఖ్యలో సవరణలు చేసింది వారే (కాంగ్రెస్)... రాజ్యాంగ పీఠికలో ఎలాంటి మార్పులు చేయకూడదని మేమంతా కోరుకున్నాం, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దానిని మార్చింది." అని పేర్కొన్నారు.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే 2025లో మోదికి 75 ఏళ్లు నిండుతాయని ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశానికి ప్రధాని అవుతారని సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. 2024, 2029లో నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అవుతారని అన్నారు.