Rajnath Singh: రిజర్వేషన్లను రద్దు చేయము.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు రాజ్‌నాథ్ సింగ్. తాము మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకమని అన్నారు. ప్రతిపక్షాలు లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. By V.J Reddy 17 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Defence Minister Rajnath Singh: రిజర్వేషన్ల అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన తమకు లేదు. మన రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదు. మతాల ఆధారంగా ఎలాంటి రిజర్వేషన్ కల్పించబడదు. ప్రస్తుత రిజర్వేషన్లు (Reservations) కొనసాగుతాయని, ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. "ప్రతిపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి... భారత రాజకీయాల్లో విశ్వాస సంక్షోభం సృష్టించడానికి కాంగ్రెస్ (Congress), దాని మిత్రపక్షాలే బాధ్యత వహిస్తాయి" అని ఆయన అన్నారు. #WATCH | Lucknow: On the issue of reservation, Defence Minister Rajnath Singh says "The question of finishing reservation does not stand. There is no provision for reservation on the basis of religion in our Constitution. No reservation is going to be given on the basis of… pic.twitter.com/vTDOFsxcwR — ANI (@ANI) May 17, 2024 ALSO READ: భారతదేశ ఆర్థిక వృద్ధి @6.9 శాతం: ఐక్యరాజ్యసమితి అంచనా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. “రాజ్యాంగంలో (Constitution) అత్యధిక సంఖ్యలో సవరణలు చేసింది వారే (కాంగ్రెస్)... రాజ్యాంగ పీఠికలో ఎలాంటి మార్పులు చేయకూడదని మేమంతా కోరుకున్నాం, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 1976లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దానిని మార్చింది." అని పేర్కొన్నారు. #WATCH | Lucknow: Defence Minister Rajnath Singh says "The maximum number of amendments in the Constitution has been done by them (Congress)...We all wanted that there should be no changes made in the Preamble of the Constitution, but the Congress Govt made a change to it in 1976… pic.twitter.com/dwQrLnHYfH — ANI (@ANI) May 17, 2024 బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే 2025లో మోదికి 75 ఏళ్లు నిండుతాయని ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశానికి ప్రధాని అవుతారని సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. 2024, 2029లో నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. #WATCH | Lucknow, UP: He (Narendra Modi) will be the Prime Minister of the country in 2024 and 2029...", says Defence Minister Rajnath Singh on Delhi CM Arvind Kejriwal's remark that after PM Modi turns 75, HM Amit Shah will become the PM of the country pic.twitter.com/W6zwR0HXtG — ANI (@ANI) May 17, 2024 #rajnath-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి