తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ కు కంచుకోటగా మారిన ఖమ్మంలో ఊహించినట్లుగానే పార్టీ హవా కొనసాగింది. పదిలో 9 స్థానాల్లో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం లభించిందంటే కాంగ్రెస్ కు ఎంతటి ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాల్లో జరిగిన ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించడంతోపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించిందనడంతో సందేహం లేదు.
పూర్తిగా చదవండి..ఖమ్మంలో కసి తీర్చుకున్న కాంగ్రెస్.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెన్నులో వణుకే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. 10లో తొమ్మిది స్థానాల్లో గెలిచి అధికార పార్టీ బీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలే టార్గెట్ గా కాంగ్రెస్ కసితీర్చుకుంది. ఫిరాయింపు నేతల ఓటమితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.
Translate this News: