BAFTA: బాఫ్టాలో మెరిసిన దీపికా పడుకోన్..ఇండియా నుంచి ఒకే ఒక్క నటి

దీపికా పడుకోన్..ఈమెకున్న క్రేజే వేరు. దేశవిదేశాల్లో భారతీయ ఘనతను నిలబెడుతున్న దీపికా మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. బాఫ్టాలో ప్రజెంటర్‌గా వ్యహరించిన తొలి హీరోయిన్‌గా ఘనత సాధించింది.

New Update
BAFTA: బాఫ్టాలో మెరిసిన దీపికా పడుకోన్..ఇండియా నుంచి ఒకే ఒక్క నటి

Deepika Padukone at BAFTA Awards: తాజాగా బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అండ్టెలివిజన్ అవార్డుల కార్యక్రమం జరిగింది. దీనికి ఇండియా నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ అటెండ్ అయింది. అంతే కాదు అక్కడ ప్రజెంటర్ గా కూడా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక భారతీయ నటి దీపికా పడుకోన్ (Deepika Padukone). ఇప్పటివరకు ఎవరికీ దక్కని ఘనత ఈమెకు దక్కడంతో మరోసారి దీపికా పేరు వార్తల్లోకి ఎక్కింది.

అవార్డు ప్రదానం..

లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బాఫ్టా అవార్డుల (BAFTA 2024 Awards)  ప్రధానోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దీపికా పడుకొనే బంగారు రంగు చీర ధరించి...పసిడి వెన్నెలలా మెరిసిపోయింది. సబ్యసాచి డిజైన్ చేసిన చీరలో దీపికా పడుకోన్ తళుక్కుమంది. బాఫ్టాలో వేదిక మీద దీపికా ‘బెస్ట్‌ ఫిల్మ్‌ నాట్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌’ కేటగిరీలో ఆమె అవార్డును ప్రదానం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో దీపికా పడుకోన్ సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లో ఉంది. ఇండియన్ క్వీన్ అంటూ నెటిజన్లు దీసికాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇది రెండవ సారి...
అంతర్జాతీయ వేడుకల్లో దీపికా పాల్గొనడం ఇది రెండవసారి. గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో (Oscar Awards) కూడా దీపికా మెరిసింది. మన తెలుగు పాట నాటు నాటుకు వచ్చిన అవార్డును దీపికానే అనౌన్స్ చేసి ప్రజెంట్ చేశారు. అవార్డు ప్రకటనకు ముందు ఈ పాటను ఆమె పరిచయం చేశారు. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు అంటూ ఆస్కార్ వేడుకలో హల్ చల్ చేసింది దీపికా. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం (RRR Movie) నుంచి నాటు నాటు ఇదే..అంటూ అప్పుడు ఆమె చేసిన ప్రసంగానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.

Also Read:Himachal Pradesh:నెలలో ఐదు రోజులు ఆడవాళ్లు బట్టలు వేసుకోని ఊరు..అదెక్కడుందో తెలుసా..

Advertisment
తాజా కథనాలు