/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-08T131935.493.jpg)
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్ తల్లిదండ్రులు అయ్యారు. శనివారం సెప్టెంబర్ 7 సాయంత్రం దీపికా ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ న్యూస్ బయటకు రావడంతో దీపికా, రణ్ వీర్ జంటకు సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీపికా- రణవీర్ 2018 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు 2024లో వీరి ప్రేమకు చిహ్నంగా పండండి బిడ్డకు జన్మనిచ్చారు.