Diwali Gandhi: నాడు రక్తపు మరకలు..నేడు వెలుగు జిలుగులు.. ఈ సారి దీపావళి తేదీ ప్రత్యేకత ఇదే..!

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరుపుకొన్న తొలి దీపావళి నవంబర్‌ 12న వచ్చింది. మళ్లీ 76ఏళ్ల తర్వాత అదే రోజు దీపావళి రావడంతో ఆనాడు గాందీజీ ఇచ్చిన సందేశం గురించి చర్చ జరుగుతోంది. గాంధీజీ అప్పుడు ఎందుకు బాధపడ్డారో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్లి చదవండి.

New Update
Diwali Gandhi: నాడు రక్తపు మరకలు..నేడు వెలుగు జిలుగులు.. ఈ సారి దీపావళి తేదీ ప్రత్యేకత ఇదే..!

How Mahatma Gandhi Wanted India To Celebrate Diwali? :

నవంబర్12, 1947.. ఆ రోజు దీపావళి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి దీపావళి.. దీపాలతో దేశం మొత్తం వెలిగిపోవాల్సిన దీపావళి.. పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ.. ఉత్సాహంతో ఉరకలేయాల్సిన రోజు.. కానీ దేశంలో సగం కంటే ఎక్కువ ప్రాంతాలు అప్పటికీ చిమ్మ చీకట్లో మగ్గిపోయి ఉన్నాయి. నెత్తుటి తడి ఇంకా ఆరలేదు.. రక్తం ఏరులై పారిన దృశ్యాలు కళ్లముందే కదులుతూ కనిపించాయి. 'మా అమ్మను చంపోద్దు..' అని ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ ఏడుస్తూ కనిపించింది. వందల ఏళ్ల బానిసత్వానికి విముక్తి లభించిందన్న ఆనందం భారతావనికి ఎక్కువ కాలం నిలవలేదు.. ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన 'విభజన హింస' ఎందరో అమాయకుల ప్రాణాలను తీసుకుంది. లక్షల మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. భారత్‌-పాకిస్థాన్‌ విభజన(India Pakistan Partition) సమయంలో జరిగిన హింస ఇప్పటికీ చరిత్రలో మానని గాయం. 20లక్షల మంది ప్రాణాలు పొగొట్టుకున్న ఈ మతహింసాకాండలో దాదాపు 2కోట్ల మంది ప్రాణభయంతో ఒక చోట నుంచి మరొక చోటుకు వలస వెళ్లిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన తొలి దీపావళి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యింది. మిగిలిన ప్రాంతాల్లో నిశబ్ధం రాజ్యమేలింది.

publive-image 1947 భారత్-పాక్ విభజన సమయంలో ప్రాణభయంతో ట్రైన్స్ లో వివిధ ప్రాంతాలకు వెళ్లిపోతున్న ప్రజలు

గాంధీ.. దేశం కోసం.. మరోసారి:
మందబలాన్ని ఆత్మబలంతో ఎదిరించాలని స్వాతంత్ర్యానికి ముందు దేశ ప్రజల గుండెల్లో ఎన్నోసార్లు అగ్ని రగిలించిన గాంధీజీ(Mahatma Gandhi)కి ఆనాడు తెలియదు.. అదే అగ్ని మతోన్మాదులకు ఆయుధంగా మారి పేద ప్రజల ఇళ్లను తగలబెడుతుందని. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన మతహింసను చూసి గాంధీజీ తట్టుకోలేకపోయారు. జరుగుతున్న నరమేధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ప్రజల్లో మార్పు కోసం కృషి చేశారు. ఇంతలో నవంబర్‌ 12 రానే వచ్చింది. దీపావళి సందర్భంగా ప్రజలను హితబోధ చేసే ప్రయత్నం చేశారు.

publive-image దేశ విభజన సమయంలో జరిగిన విధ్వంసం

గాంధీజీ దీపావళి మెసేజ్‌:
హిందూ క్యాలెండర్‌లో దీపావళి గొప్ప రోజు అంటూ తన సందేశాన్ని ప్రారంభించిన గాంధీజీ తాను నమ్మిన రాముడిని, రామాయాణాన్ని గుర్తు చేసుకున్నారు. రాముడి మంచికి ప్రతీక అని.. అటు రావణుడు చెడుకు ప్రతీక అంటూ.. ఈ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో మంచే గెలిచిందన్న విషయం మారవకూడదన్నారు. ఈ విజయం మన దేశంలో రామరాజ్యాన్ని స్థాపించేలా చేసిందన్న గాంధీ.. స్వాతంత్ర్యం తర్వాత పరిణామాలను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

publive-image లక్షాలది మందిని పొట్టనపెట్టుకున్న దేశ విభజన

'నేడు దేశంలో రామరాజ్యం లేదు. కాబట్టి మనం దీపావళిని ఎలా జరుపుకోగలం? మనసులో రాముడు ఉన్నవారే ఈ విజయాన్ని జరుపుకోగలరు. ఎందుకంటే, దేవుడు మాత్రమే మన ఆత్మలను ప్రకాశించేలా చేయగలడు. ఆ వెలుగు మాత్రమే నిజమైన వెలుగు. మనకు కావలసింది మన హృదయాల్లో ప్రేమ వెలుగు. మనసు లోపల ప్రేమ కాంతిని వెలిగించాలి..' అని చెప్పిన గాంధీజీ.. హిందువులు, సిక్కులు లేదా ముస్లింలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు మీ సొంత సోదరుడు లేదా సోదరి అని చెప్పగలరా అని ప్రజలను ప్రశ్నించారు.

publive-image కశ్మీర్ ప్రజలతో మాట్లాడుతున్న నెహ్రూ( File PC/lokmarg)

నెహ్రూ ఎంత బాధపడ్డారో:
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువగా హింసకు గురైన ప్రాంతాల్లో కశ్మీర్‌ ఒకటి. కశ్మీర్‌ను హస్తగతం చేసుకునేందుకు పాకిస్థాన్‌ ఆడిన రాక్షస క్రీడాలో ఆ ప్రాంతం అందాలను కోల్పోయింది. ఇదే విషయాన్ని గాంధీజీ తన దీపావళి సందేశంలో చెప్పుకొచ్చారు. గాయపడిన కశ్మీర్‌ను చూసి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తట్టుకోలేకపోయారని.. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నెహ్రూ హృదయం విషాదంతో నిండిపోయిందన్నారు గాంధీ. దోపిడీ, దహనం, రక్తపాతం సుందరమైన కశ్మీర్‌ అందాన్ని పాడు చేశాయని వాపోయారు. ప్రాణ భయంతో ఇండియా నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన ముస్లింలు, పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు వచ్చిన హిందూవులు తిరిగి తమ స్థానాలకు ఆనందంగా వెళ్లగలిగినప్పుడే దీపావళి జరుపుకోవాలంటూ గాంధీజీ ఆనాడు ఎంతో బాధపడ్డారు.


ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది?
76 ఏళ్ల తర్వాత.. 27,757 రోజుల తర్వాత మరోసారి దీపావళి నవంబర్‌ 12న వచ్చింది. ఈ 76ఏళ్లలో ఇండియా ఎంతో మారింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు ధీటుగా నిలుస్తోంది. అటు పాకిస్థాన్‌ మాత్రం దాదాపు అన్ని రంగాల్లో అట్టడుగుకు వెళ్లిపోయింది. మతోన్మాదంతో ఈనాటికి పాకిస్థాన్‌ ఊగిపోతోంది. అప్పటికీ ఇప్పటికీ పాకిస్థాన్‌ ఈ విషయంలో మారలేదు. ఇటు భారత్‌ వెలుగుల పండుగ దీపావళికి ముస్తాబైంది. ఈ 76ఏళ్లలో అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోకి భారత్‌ ప్రయాణించిన తీరు నిజంగా అద్భుతం..!

Also Read: శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ..సభ్యత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం..!!

Advertisment
తాజా కథనాలు