Loksabha: మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్..మొత్తం 146 కి చేరిన సంఖ్య!

లోక్‌ సభలో ఎంపీల సస్పెన్షన్‌ పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను సభ గురువారం సస్పెండ్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్‌ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.

Loksabha: మరో ముగ్గురు ఎంపీల సస్పెన్షన్..మొత్తం 146 కి చేరిన సంఖ్య!
New Update

మరో ముగ్గురు ఎంపీలను (MP)  లోక్‌సభ (Loksabha) గురువారం సస్పెండ్‌ చేసింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండైన ఎంపీల సంఖ్య 146 కు చేరుకుంది. డిసెంబర్‌ 13 వ తేదీన పార్లమెంట్‌ లోనికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సభలో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ విషయం లోక్‌ సభ, రాజ్య సభ రెండింటికి అంతరాయం కలిగించడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణతో ఇప్పటి వరకు 143 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా గురువారం నాడు ప్రతిపక్ష ఎంపీలను మరో ముగ్గురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ ఓం బిర్లా.

ఈ రోజు సస్పెండైన వారిలో కాంగ్రెస్‌ ఎంపీలు దీపక్‌ బైజ్‌, నకుల్‌ నాథ్, డీకే సురేశ్‌ లు ఉన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా గురువారం ఎంపీలు పార్లమెంట్‌ నుండి ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ కు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ..మోదీ సభలో భద్రతా ఉల్లంఘన అంశం పై మాట్లాడకుండా ఉండడం శోచనీయమని ఎంపీలో ఆరోపించారు.

ఘటన జరిగి 5 రోజులు అయినప్పటికీ ప్రధాని స్పందించకపోవడం చాలా బాధాకరమని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. ప్రజాస్వామ్యానికి మోదీ ప్రభుత్వం బిగించిన ఉరి ఇది అని పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన భద్రతా ఉల్లంఘనలపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సభలోనికి ప్రవేశించి స్మోక్‌ బాంబులు ప్రయోగించిన విషయం గురించి ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడకపోవడంతో విపక్షాలు ఆయన వెంటనే ఈ ఘటన గురించి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also read:  ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన స్టార్ నటుడి కుమారుడు!

#suspension #mp #loksabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe