Breaking: రాజోలు జనసేన ప్రకటన...!

రాజోలు జనసేన అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఉత్కంఠ వీడింది . మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్‌ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఎలాగైనా అక్కడ గెలవాలని జనసేన గట్టి పట్టుదలగా ఉంది

Breaking: రాజోలు జనసేన ప్రకటన...!
New Update

Pawan Kalyan:

రాజోలు జనసేన అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. 2019 ఎన్నికలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. అయితే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌  వైసీపీలోకి మారడంతో అక్కడి సీటు మీద సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ సారి కూడా జనసేన అక్కడ పాగా వేయాలని చూస్తుంది.

తాజాగా ఆ సస్పెన్స్‌ కు తెరపడింది. జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ దేవా వరప్రసాద్‌ ను పవన్‌ ఖరారు చేశారు. వరప్రసాద్‌ స్వగ్రామం మలికిపురం మండలంలోని దిండి గ్రామం. ముందు నుంచి పార్టీలో ఉండి టికెట్‌ వస్తుందని ఆశపడిన బొంతు రాజేశ్వరరావు కు నిరాశే ఎదురయ్యింది.

.

Also read: ఈ ఏడాది చంద్రగహణం ఎప్పుడంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

#rajole #janasena #pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe