December Rules: ప్రతి రోజు.. లెక్కపెట్టుకుంటూ గడిపేయడం మనకి అలవాటు అయిపొయింది. ఎప్పుడు ఏ ధరల బాంబు ఎక్కడ పేలుతుందో అని బిక్కు బిక్కు మంటూ జీవితం నెట్టుకువచ్చేయడం చాలా కామన్ గా మారిపోయింది. అయితే, కొత్త ల వస్తుందంటే మాత్రం, అమ్మో..ఒకటో తారీఖు అనుకోవడం ప్రజలందరికీ తప్పనిసరి. ఒకటో తేదీ తీసుకువచ్చే మార్పులు ఒక్క నెల మీద మాత్రమే కాదు.. రాబోయే అన్ని రోజుల మీద పడుతుంది. ఇదిగో నవంబర్ అయిపోతోంది. ఇక డిసెంబర్ 1 వతేదీ వచ్చేస్తోంది. క్యాలెండర్ సంవత్సరంలో చివరి నెల.. మామూలుగానే బోలెడు మార్పులు.. చేర్పులు తీసుకు వచ్చేస్తోంది. వాటిలో మన జేబుకి చిల్లు పెట్టేవి కొన్ని.. మన పర్స్ ఖాళీ చేసేసేవి మరికొన్ని.. హమ్మయ్య ఈసారికి బతికిపోయాం అనిపించేవీ మరిన్ని.. మరి అటువంటి మన జేబుపై ప్రభావం చూపించేవి ఏమి ఉన్నాయో తెలుసుకుందాం.
ముందుగా బ్యాంకుల స్కీమ్స్.. నిబంధనల్లో వచ్చే మార్పులు చూద్దాం..
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో మార్పులు వస్తున్నాయి. HDFC బ్యాంక్, దాని Regalia క్రెడిట్ కార్డ్‌లో లాంజ్ యాక్సిస్ ప్రోగ్రామ్‌లో డిసెంబర్ 1 నుంచి మార్పులు9December Rules) తీసుకువస్తోంది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సౌకర్యం కోసం ప్రతి మూడు నెలలకు రూ. 1 లక్ష క్రెడిట్‌ని ఉపయోగించడం తప్పనిసరి చేశారు.
ఆర్బీఐ బ్యాంకులకు హోమ్ లోన్స్ సంబంధించి అతి పెద్ద నిబంధన తీసుకువచ్చింది. హోమ్ లోన్స్ కోసం తాకట్టు పెట్టిన ఆస్తి పత్రాలు.. లోన్ తీరిపోయిన 30 రోజుల్లోగా కస్టమర్ కి తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే ప్రతి నెల కస్టమర్ కు 5 వేల రూపాయల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
ఇక స్టేట్ బ్యాంక్ ఇండియా అమృత్ కలశ్ పథకం డిసెంబర్ 31తో (December Rules) ముగుస్తుంది. దీనిలో టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 7.10 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తోంది.
బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ కు సంబంధించి ముఖ్యమైన పని డిసెంబర్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ రెన్యూవల్ గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. 2022 డిసెంబరు 31 కంటే ముందు లాకర్ అగ్రిమెంట్‌ను చేసుకున్నవారు.. 2023 డిసెంబరు 31లోగా మరోసారి బ్యాంకులతో తమ లాకర్ అగ్రిమెంట్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా ఎస్బీఐ కి సంబంధించింది. హోమ్ లోన్ తీసుకునే తన కస్టమర్ల కోసం ఎస్బీఐ స్పెషల్ ఆఫర్ తెచ్చింది. హోమ్ లోన్స్ పై గరిష్టంగా 65 బేసిస్ పాయింట్లు రాయితీ ఇస్తోంది. ఇది కూడా డిసెంబర్ 31తో(December Rules) ముగిసిపోతుంది.
Also Read: బంగారం కొనడం కష్టమే గురూ.. ఆల్ టైమ్ హై రికార్డ్ స్థాయిలో ధరలు
ఈ మార్పు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కోసం. మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఎకౌంట్స్ కి సంబంధించి నామినీని యాడ్ చేసుకోకపోతే తరువాత ఇబ్బందులు తప్పవు. నామినీని యాడ్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకూ మాత్రమే సెబీ గడువు ఇచ్చింది. దీని తరువాత నామినీ లేని ఎకౌంట్స్ నిలిచిపోతాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నవారికి డెడ్ లైన్ నవంబర్ 30తో ముగిసిపోతుంది. అదేమిటంటే.. లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం. మీరు ఇప్పుడు వెంటనే మీ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే డిసెంబర్ నెల నుంచి మీ పెన్షన్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది.
కొత్త సిమ్ కార్డులపై కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. మోసాలను అరికట్టడం కోసం కేంద్రం ఈ రూల్స్ తీసుకువస్తోంది. కేవైసీ లేకుండా ఇకపై సిమ్ ఇవ్వరు. అంతే కాదు ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ రెండు రూల్స్ పాటించని దుకాణదారులకు 10 లక్షల రూపాయలవరకూ పెనాల్టీ విదిస్తుంది ప్రభుత్వం.
ఆధార్ అప్డేట్ టైం పూర్తి అవుతోంది. ఉచితంగా ఆధార్ కార్డులో ఎడ్రస్.. ఫోటో వంటివి ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి తేదీ. ఆ తరువాత ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తి అయిన వారంతా తమ ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఆధార్ అప్‌డేట్ చేయాలంటే రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
Watch this interesting Video: