Gold Mines : ఏపీ(Andhra Pradesh)లో బంగారం ఉత్పత్తి(Gold Production) త్వరలోనే ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారత్(India) లో ప్రైవేట్ రంగంలోనే అతి పెద్ద బంగారు గని ఇదే కావడం విశేషం. డక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ అనుబంధ సంస్థ జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ ను అభివృద్ది చేస్తోంది
బంగారం తవ్వకాల కోసం ఇప్పటికే ఈ ప్రాంతంలో 250 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టి ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులు సైతం 60 శాతానికిపైగా పూర్తయ్యాయి. జొన్నగిరి బంగారు గనిలో గోల్డ్ ఉత్పత్తికి సంబంధించి ప్రయోగాత్మక పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ గనిపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు డక్కన్ గోల్డ్ మైన్స్ వెల్లడించింది. మొజాంబిక్ ఎల్‌డీఏ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో డక్కన్ గోల్డ్ మైన్స్(Deccan Gold Mines) కు 51 శాతం వాటా ఉండగా.. దానిని 70 శాతానికి పెంచుకునే అవకాశం ఉన్నట్లు సమచారం ఆ గనుల్లో రోజుకు 100 టన్నుల లిథియమ్, టాంటలమ్, ఇతర ఖనిజాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం గల ప్లాంట్లను కంపెనీ ఏర్పాటు చేయనుంది.