AP-TS Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ఎంతమంది బరిలో నిలిచారంటే!

ఏపీ, తెలంగాణలో నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది. ఏపీలో 175 శాసనసభ నియోజకవర్గాలకు 2705, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది బరిలో నిలిచారు.

New Update
AP-TS Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. ఎంతమంది బరిలో నిలిచారంటే!

AP-TS: తెలంగాణ, ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఏపీలో 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు దాఖలవగా.. 2705 నామినేషన్ల ఆమోదం పొందాయి. అలాగే 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలవగా 503 నామినేషన్లు అమోదం పొందాయి. ఇక తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లను ఆమోదించగా 100 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 525 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా సికింద్రాబాద్‌ లోక్‌సభకు 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్‌ లోక్‌సభకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏపీలో తిరుపతి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 46 మంది, నగరిలో అత్యల్పంగా 6గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

ఇది కూడా చదవండి: Hyderabad: ఓయూలో నీళ్ల కష్టాలు.. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల ఆందోళన!

జిల్లాల వారిగా బరిలో నిలిచిన భ్యర్థులు..
అలాగే పులివెందులలో సీఎం జగన్‌ తో 27 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా 13 మంది పోటీలో ఉన్నారు. మంగళగిరిలో లోకేశ్‌ సహా 40 మంది రంగంలోకి దిగనున్నారు. ఇక తెలంగాణలో లోక్‌సభ స్థానాల్లో బరిలో నిలిచిన పెద్దపల్లిలో-42, కరీంనగర్‌లో -28, నిజామాబాద్‌లో-29, జహీరాబాద్‌లో-19, మెదక్‌లో-44, మల్కాజిగిరిలో-22, హైదరాబాద్‌లో-30, చేవెళ్లలో-43, మహబూబ్‌నగర్‌లో-31, నాగర్‌ కర్నూల్‌లో-19, నల్గొండలో-22, భువనగిరిలో-39, వరంగల్‌లో-42, మహబూబాబాద్‌లో-23, ఖమ్మంలో-35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికలకు మే 13న పోలింగ్‌ జరగనుండగా.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ త‌ర్వాత ఇండిపెండెట్ అభ్యర్దుల‌కు గుర్తులు కేటాయించ‌నున్న ఆర్వోలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు