AP News: మరొకరిని మింగిన బుడమేరు.. వినాయకచవితి నాడు గల్లంతై.. బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఇవాళ మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది. అయితే ఫణికృష్ణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. By Vijaya Nimma 09 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: విజయవాడలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయి. వరదల ఉధృతికి బుడమేరు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఏపీలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగుకు మూడు గండ్లు పడ్డాయి. విజయవాడలో అనేక పరీవాక ప్రాంతాల్లో వరద నీరు వచ్చే ఇళ్లు అన్ని జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో.. వినాయక చవితి పండుగ రోజు (శనివారం) రాత్రి బుడమేరులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఆ రోజు బుడమేరులో గల్లంతైన వ్యక్తి డెడ్‌బాడీ లభ్యమయింది. ఈ రోజు మధ్యాహ్నం మృతదేహాన్ని NDRF సిబ్బంది గుర్తించారు. గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర కొట్టుకుపోయిన ఫణికృష్ణ.. పడిన ప్రదేశానికి దగ్గరలోనే మృతదేహం ఉంది. మచిలీపట్నానికి చెందిన ఫణికుమార్ హైదరాబాద్‌లో ఉంటూ.. వినాయక చవితికి స్వగ్రామానికి వచ్చాడు. గన్నవరంలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లి తిరిగి వెళ్లాడు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుందని.. విజయవాడ మీదుగా వెళ్లాలని బంధువులు సూచించారు. అయినా వినకుండా కేసరపల్లి- ఉప్పులూరు- కంకిపాడు మీదుగా వెళ్తానని ఫణికుమార్ చెప్పారు. అనంతరం ఆయన బయలుదేరిన కొద్దిసేపటికి బుడమేరు ప్రవాహానికి ఆయన కారు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తుండగా.. కొట్టుకుపోయిన ప్రదేశానికి కొద్ది దూరంలో మృతదేహం లభ్యమైంది. #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి