Kuwait fire incident: భారత్‌కు చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వైమానిక దళానికి చెందిన విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

New Update
Kuwait fire incident: భారత్‌కు చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

Kuwait fire incident:ఈ నెల 12న కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. కాగా చనిపోయిన వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. మృతుల్లోకేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారిక వర్గాలు చెప్పాయి.

వాయుసేన విమానంలో వారి మృతదేహాలను ఈరోజు కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్‌, కేంద్రమంత్రి సురేష్ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు.బాధితుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు