తుది దశకు చేరిన చంద్రయాన్... ల్యాండింగ్ కు ఇంకా మూడు రోజులే.....!

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ మాడ్యుల్ తన రెండవది, చివరిదైనా డీ బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు చంద్రునికి అత్యంత సమీప ప్రాంతానికి ల్యాండర్ చేరుకుంది. ప్రస్తుత విక్రమ్ ల్యాండర్ కక్ష దూరం 25 కిమీX134 కిలోమీటర్లకు తగ్గించినట్టు తెలిపింది.

author-image
By G Ramu
తుది దశకు చేరిన చంద్రయాన్... ల్యాండింగ్ కు ఇంకా మూడు రోజులే.....!
New Update

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండింగ్ మాడ్యుల్ తన రెండవది, చివరిదైనా డీ బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు చంద్రునికి అత్యంత సమీప ప్రాంతానికి ల్యాండర్ చేరుకుంది. ప్రస్తుత విక్రమ్ ల్యాండర్ కక్ష దూరం 25 కిమీX134 కిలోమీటర్లకు తగ్గించినట్టు తెలిపింది.

డీ బూస్టింగ్ సమయంలో ల్యాండర్ లో ఏర్పాటు చేసిన నాలుగు ఇంజన్లు పని చేయాల్సి వుంటుంది. మొదటి డీ బూస్టింగ్ సమయంలో రెండు ఇంజన్లు, రెండవ డీ బూస్టింగ్ సమయంలో మరో రెండు ఇంజన్లు సమర్థవంతంగా పని చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ల్యాండర్ విక్రమ్ ప్రస్తుతం సక్రమంగానే పని చేస్తోందని ఇస్త్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ నెల 23న సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రునిపై ఏ ప్రాంతంలో ల్యాండ్ అవ్వాలనే విషయంపై ఈ మూడు రోజులు పాటు విక్రమ్ ల్యాండర్ సెర్చ్ చేయనుంది. ఆ సమయంలో మాడ్యూల్ లో అంతర్గత పరిశీలనలు జరుగుతాయని ఇస్రో పేర్కొంది.

చంద్రయాన్-3 విజయవంతం అయితే అది భారత అంతరిక్ష రంగంలో ఓ మైలు రాయిగా మిగిలి పోతుందని ఇస్రో చెప్పింది. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ కావాలని దేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోందని వివరించింది. అందుకే ఈ నెల 23న సాయంత్రం 5.27 గంటల నుంచి ల్యాండింగ్ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్టు ఇస్రో తెలిపింది.

చంద్రయాన్-3 విజయవంతం అయ్యేందుకు ఎక్కవ అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్(ఐఐఏ), సీనియర్ ఆస్ట్రోనామర్ ప్రొఫెసర్ అన్నపూర్ణ సుబ్రహ్మణియన్ అన్నారు. చంద్రయాన్-3కి చివరి 30 కిలోమీటర్లు అత్యంత కీలకమైన సమయమన్నారు. ఈ సారి మిషన్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

#isro #moon #landing #vikram-lander #chandra-yan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe