Modi 3.0: డీడీ లోగోకు కాషాయం రంగు..ఇది ఆరంభం మాత్రమే..మోదీ అసలు ప్లాన్ తెలుస్తే..! డీడీ లోగో నీలి రంగు నుంచి కాషాయం రంగులోకి మారడంపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. బీజేపీ రంగులోకి మారడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే ఇది ఆరంభం మాత్రమేనని..అసలు ప్రణాళికలు ముందున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దూరదర్శన్ పై మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటీ? By Bhoomi 21 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Modi 3.0: డీడీ లోగో నీలిరంగు నుంచి కాషాయం రంగులోకి మారడంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఆరంభం మాత్రమేనని..బీజేపీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రసార భారతిలో అనేక మార్పులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సోర్సెస్ చెబుతున్నాయి. డీడీలోగో రంగు మార్పుపై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఏంటీ? చూద్దాం. దేశ ప్రజలతోనే కాదు కొన్నికోట్ల కుటుంబాలతో కొన్ని దశాబ్దాలుగా ముడివేసుకుపోయింది దూరదర్శన్. దూరదర్శన్ అనగానే 80వ దశకం, 90వ దశకం వారికి గుర్తుకు వచ్చేది సీరియళ్లు. రాత్రి 7 గంటల వార్తలు, చిత్రలహరి, ఆదివారం ప్రసారమయ్యే రామాయణం, మహాభారతం. అప్పట్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే సూపర్ మ్యాన్ వంటి ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తుండేవి. ప్రైవేట్ ఛానెల్స్ పుణ్యామా అని ప్రభుత్వ ఆధీనంలో నడిచే దూరదర్శన్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినాకూడా ఈ ఛానెల్ మాత్రం దేశ ప్రజల నుంచి ఏనాడూ దూరం కాలేదు. తాజాగా దూరదర్శన్ ఛానెల్ లోగో రంగు మార్పుతో రాజకీయంగా పెనుసంచలనంగా మారింది. దూరదర్శన్ ఛానెల్ రంగు ఇప్పుడు నీలం రంగు నుంచి కాషాయంలోకి మారడం వివాదస్పదంగా మారింది. ప్రతిపక్షాలు అన్నీ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. బీజేపీ రంగులోకి మారడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. దీంతో దేశంలో ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు దూరదర్శన్ ఛానెల్ లోగో రంగు మార్పు అస్త్రంగా మారింది. గతవారం డీడీ ఛానెల్ లోగోను మార్చిన వెంటనే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ డీడీ లోగోను కాషాయం రంగులోకి మార్చడం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ ఒకటి బయటకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీడీలోగో రంగు మార్చడం ఆరంభం మాత్రమేనని తెలుస్తోంది. ప్రధాని మోదీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వస్తే.. ప్రసార భారతి కోసం డీడీ న్యూస్ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.సమాచార. ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) ప్రసార భారతిలో మోదీ ప్రభుత్వం 3.0 అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డీడీ లోగో రంగు మార్పుపై మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటీ? మోదీ ప్రభుత్వం 3.0 భవిష్యత్తు ప్రణాళికలు ఇవే: -డీడీ ఇండియా15దేశాల్లో బ్యూరోలతో గ్లోబల్ బ్రాండ్ గా డెవలప్ అవుతుంది. -ప్రసారభారతి SHABD పోర్టల్ గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా అభివృద్ధి చెందుతుంది. -విదేశీ అవుట్‌లెట్‌లతో సహా 1000 కంటే ఎక్కువ మీడియా యూనిట్లను ఆన్‌బోర్డ్ చేయడం ద్వారా MIBలో కృత్రిమ మేధస్సు (AI) హబ్ ప్లాన్. -సాధారణ పౌరులకు ఆర్కైవల్ మెటీరియల్స్, మీడియా యాక్సెస్ కోసం భారత్ నామన్ పోర్టల్ ప్రారంభం. -PIB ఫ్యాక్ట్-చెక్ యూనిట్‌ని విస్తరించడం ద్వారా 'గ్లోబల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్', 'ఫేక్ న్యూస్'లను ఎదుర్కోవాలనేది ప్లాన్. -ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) మాస్టర్స్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వ సారి అధికారంలోకి వస్తే పంచవర్ష ప్రణాళికలో ఇవన్నీ భాగమవుతాయి. కాషాయ రంగు లోగో వివాదం ఏమిటి? దూరదర్శన్ బ్లూ లోగో నుండి నారింజ రంగులోకి మారిన తర్వాత వివాదం చెలరేగింది. 1982లో ఛానల్ కోసం ఇందిరా గాంధీ ఎంచుకున్న అసలు రంగు పునరుద్ధరించినట్లు బీజేపీ తెలిపింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి.తృణమూల్ ఎంపీ జవహర్ సిర్కార్, టీవీ మాతృసంస్థ ప్రసార భారతి మాజీ అధిపతి కూడా ఎన్నికలకు ముందు టీవీ లోగోను కాషాయీకరణ చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఇది కూడా చదవండి : ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..టెస్లా కార్ల ధరలు తగ్గింపు..ఎంతంటే? #pm-modi #modi-government #tv-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి