Pallavi Prashanth Arrest: పొమ్మన్నా పోలేదు.. మళ్లీ రావడంతోనే గొడవ.. పల్లవి ప్రశాంత్ కేసుపై డీసీపీ సంచలన నిజాలు

తాజాగా డీసీపీ విజయ్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కు సంబంధించి మాట్లాడారు. విజేతను ప్రకటించిన అనంతరం స్థూడియో ముందు పరిస్థితిని గమనించిన పోలీసులు ప్రశాంత్ ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. కానీ ప్రశాంత్ మళ్ళీ వెనక్కి వచ్చినందున జనం ఎక్కువై గొడవకు కారణమైందని తెలిపారు.

New Update
Pallavi Prashanth Arrest: పొమ్మన్నా పోలేదు.. మళ్లీ రావడంతోనే గొడవ.. పల్లవి ప్రశాంత్ కేసుపై డీసీపీ సంచలన నిజాలు

Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్థూడియో ముందు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ప్రభుత్వ బస్సుల అద్దాలను ధ్వంశం చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘర్షణలో ఆరు ప్రభుత్వ బస్సులను ధ్వంశం చేయడంతో పాటు పలువురు పోలీసులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన సంబంధించి పల్లవి ప్రశాంత్, అతని అభిమానుల పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని తమ నివాసమైన గజ్వేల్ లోని కొల్లూరులో అరెస్ట్ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

తాజాగా డీసీపీ విజయ్ ఈ ఘటనకు సంబంధించి మాట్లాడారు. ఆదివారం అన్నపూర్ణ స్థూడియో ఎదుట జరిగిన గొడవలో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొదటి కేసులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారని.. మరోక వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. రెండవ కేసులో ఘటనకు కారణమైన 16 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. విజేతను ప్రకటించిన అనంతరం.. స్థూడియో ముందు పరిస్థితిని గమనించిన పోలీసులు.. ఆ ప్రదేశం నుంచి ప్రశాంత్ ను వెళ్ళిపోమని చెప్పినట్లు తెలిపారు. కానీ ప్రశాంత్ పోలీసులు ఆదేశాలను లెక్క చేయకుండా మళ్ళీ వెనక్కి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. దాంతో అక్కడ అధిక శాతంలో జనం గుమిగూడి పెద్ద గొడవ జరగడానికి ప్రశాంత్ కారణమయ్యారని డీసీపీ విజయ్ తెలియజేశారు.

Also Read: Pallavi Prashanth: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ కష్టమేనా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు