/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/digene-jpg.webp)
Recall For Digene Gel: డైజీన్ సిరప్ తాగుతున్నారా?..అయితే, బీ కేర్ ఫుల్. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) డైజీన్ సిరప్‌ను వాడద్దంటూ హెచ్చరిక జారీ చేసింది. డైజీన్ జెల్, సిరప్ వాడకాన్ని వెంటనే నిషేదించాలని, మార్కెట్ నుండి వెంటనే ఉపసంహరించుకోవాలని DCGI ఆదేశించింది.దీంతో మార్కెట్ నుండి కోట్ల బాటిళ్లను కంపెనీ రీకాల్ చేసింది.
డైజీన్ సిరప్‌ను సాధారణంగా కడుపునొప్పి లేదా గ్యాస్ నొప్పికి ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి, డైజీన్ జెల్ మింట్ ఫ్లేవర్ బాటిల్ రుచి తీయ్యగా ఉండి..లేత గులాబీ కలర్‌లో ఉంటుంది.అయితే కొన్ని బ్యాచ్‌ల్లోని బాటిళ్ల నుంచి ఘాటైన వాసనం రావడం..బాటిల్ వైట్ కలర్ మారడంతో పాటు రుచి చేదుగా ఉండడంతో కస్టమర్ 9 ఆగస్టు 2023న కంప్లైంట్ చేశారు. కస్టమర్ ఫిర్యాదుపై అలర్ట్ అయిన సిరప్ తయారీదారు అబాట్ ఆగస్టు 11న DCGIకి తన ఉత్పత్తిని మార్కెట్ నుండి ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పింది.ఈ నిర్ణయంతో కంపెనీ పెద్ద ఎత్తున నష్టపోయింది.
మార్కెట్‌లో ఈ స్టాక్‌ను పరిశీలించాలని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ ఉత్పత్తిని తిరస్కరించిన తర్వాత కూడా మార్కెట్‌లో విక్రయిస్తే, తగిన చర్యలు తప్పవంటూ ఆదేశాలు జారీ చేసింది. హోల్‌సేల్ వ్యాపారులు, పంపిణీదారులు ఈ ఉత్పత్తులన్నింటినీ తమ దుకాణాల నుండి తొలగించాలని సూచించింది. గోవాలో తయారుచేసిన ఈ ఔషధం ఉత్పత్తిని ఉపయోగించవద్దని DCGI ఆదేశించింది.
కానీ, ఇప్పటికీ పలు షాపుల్లో డైజీన్ సిరప్ బాటిళ్లు లభ్యమవుతునే ఉన్నాయి. అబాట్ డైజీన్ జెల్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే డైజిన్ ట్యాబ్లెట్లు మాత్రం సేఫే అంటున్నారు.