DC vs KKR : కొడితే బాల్ బీచ్ లో పడింది.. విశాఖలో కేకేఆర్ సిక్సర్ల సునామీ..!

సిక్సర్ల వర్షంతో విశాఖ స్టేడియం తడిసి ముద్దయ్యింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్ తో చెలరేగి ఆడారు. ఓపెనర్ సునీన్ నరైన్ అర్థ సెంచరీతో చెలరేగాడు. అంగ్ క్రిష్ రాఘువంశీ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

New Update
DC vs KKR : కొడితే బాల్ బీచ్ లో పడింది.. విశాఖలో కేకేఆర్ సిక్సర్ల సునామీ..!

Visakha Beach :  ఐపీఎల్ 2024(IPL 2024) 16వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) మధ్య జరిగింది. వైజాగ్ స్టేడియంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించింది కేకేఆర్. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెల‌రేగి ఆడారు. దొరికిన బంతిని దొరిక‌న‌ట్టు చితక్కొట్టారు. రెండు గంట‌ల పాటు ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కొసారు. దాంతో, వైజాగ్‌లో అత్య‌ధిక సిక్స‌ర్ల(15) రికార్డు బీచ్ లో కొట్టుకుపోయింది. హ్యాట్రిక్ విజ‌యంపై క‌న్నేసిన కేకేఆర్ నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగుల స్కోర్ కొట్టింది. త‌ద్వారా ఐపీఎల్‌లో అత్య‌ధిక స్కోర్ బాదిన రెండో జ‌ట్టుగా కోల్‌క‌తా హిస్టరీ క్రియేట్ చేసింది. మొద‌ట‌ ఓపెన‌ర్ సునీల్ న‌రైన్(85) అర్థ సెంచ‌రీతో చెల‌రేగ‌గా… అరంగేట్ర కుర్రాడు అంగ్‌క్రిష్ రాఘువంశీ(54) ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపిస్తూ ఉరుకులు పరుగులు పెట్టించాడు.

కోల్‌క‌తా బ్యాట‌ర్ల వీర‌బాదుడు చూస్తుంటే... ఐపీఎల్ రికార్డు స్కోర్ 277 బ‌ద్ధ‌లవుతుంది ఖాయం అనిపించింది. కానీ, ఢిల్లీ బౌల‌ర్లు చివ‌ర్లో అద్భుతంగా కోల్‌క‌తా హిట్ట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు.టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్ కు ఓపెన‌ర్లు ఫిలిఫ్ సాల్ట్(15), న‌రైన్‌(85)లు మంచి ఆరంభాన్ని అందించారు. ఇషాంత్ శ‌ర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌తో న‌రైన్ ప‌రుగుల వేటను షురూ చేశాడు. బౌల‌ర్లు మారినా.. బంతి ల‌క్ష్యం బౌండ‌రీయే అన్న‌ట్టు చెల‌రేగి ఆడాడు. దాంతో, స్కోర్‌బోర్డు రాకెట్ వేగంతో ప‌రుగులు పెట్టింది. ఆండ్రూ ర‌స్సెల్‌(41), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(18) విధ్వంసాన్ని కొన‌సాగించారు.. కోల్‌క‌తా స్కోర్ 230 దాటించారు. చివ‌ర్లో.. రింకూ సింగ్‌(26) సిక్స‌ర్ల‌తో రెచ్చిపోవ‌డంతో అయ్య‌ర్ సేన భారీ స్కోర్ పెరిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో నార్జియా మూడు వికెట్లు తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి : ‘మిడిల్ క్లాస్ హీరో’33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానానికి తెర..!

Advertisment
Advertisment
తాజా కథనాలు