Warner Vs SRH: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్ అన్ననే బ్లాక్ చేస్తారా? 2016లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీని అందించాడు వార్నర్. తర్వాత ఒక సీజన్ సరిగ్గా ఆడకపోవడంతో అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టగా..తాజాగా వార్నర్‌ను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను స్వయంగా వార్నరే షేర్ చేశాడు. By Trinath 19 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఎవరైనా మన కోసం కష్టపడి మంచి ఫలితాన్ని ఇస్తే వారి పట్ల కృతజ్ఞతా భావం చూపంచాలి. ఒకవేళ అతి చేతకకపోతే కనీసం అవమానించకుండా ఉండాలి. ఈ రెండు లేకపోతే జనాలు తిట్టుకుంటారు. ఐపీఎల్(IPL)లో హైదరాబాద్ కప్ గెలిచింది రెండుసార్లే. అందులో ఒకసారి డెక్కన్ ఛార్జెర్స్‌గా ఉన్నప్పుడు గెలవగా.. రెండోసారి సన్‌రైజర్స్(Sunrisers)గా విజయం సాధించింది. 2016లో డేవిడ్ వార్నర్(David Warner) కెప్టెన్సీలో హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఆ సీజన్‌లో వార్నర్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్‌తోనూ మెరిశాడు. టోర్నీలోనే రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్‌లోనూ రాణించాడు. అలాంటి వార్నర్ ఆ తర్వాత శాండ్‌పేపర్ స్కామ్‌లో చిక్కుకపోవడం.. అతనిపై వేటు పడడం.. తర్వాత ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. వార్నర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఒక్క సీజన్‌కే పక్కనపెట్టిన హైదరాబాద్ అయితే ఓ సీజన్‌లో బాగా ఆడకపోవడంతో వార్నర్‌ను సన్‌రైజర్స్ పక్కన పెట్టింది. నిజానికి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుఫున ఒంటరిపోరాటం చేసేవాడు వార్నర్. మిగిలిన బ్యాటర్లు విఫలమవుతుంటే ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు నిలబడి గెలిపించేవాడు. అలాంటి వార్నర్‌ను కేవలం ఒక్క సీజన్ సరిగ్గా ఆడలేదని పక్కన పెట్టడం హైదరాబాద్ అభిమానులకు నచ్చలేదు. ఇక తాజాగా వార్నర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో బ్లాక్ చేసిందని పోస్ట్ చేశాడు. ఏం జరిగిందంటే? ఐపీఎల్‌లో ఈ సారి ఆస్ట్రేలియా ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది సెకండ్ హయ్యస్ట్ బిడ్డింగ్. ఈ క్రమంలోనే కమ్మిన్స్‌ను అభినందించేందుకు సోషల్‌మీడియా అకౌంట్స్‌లో లాగిన్ అయిన వార్నర్ కంగుతిన్నాడు. కమ్మిన్స్‌ను విషెస్ చెబుతున్న పోస్ట్‌లో హైదరాబాద్ ఫ్రాంచైజీని ట్యాగ్ చేసేందుకు చూడగా అసలు విషయం బయటపడింది. SRH సోషల్‌మీడియా హ్యాండిల్స్ తనను బ్లాక్ చేసిందని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశాడు. Also Read: ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే..! #david-warner #sunrisers-hyderabad #ipl-auction-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి