David Miller : తన ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్. ! దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన ప్రేయసి కామిలా హారిస్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు వారు ఒక్కటైన ఫొటోలను హారిస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ప్రేమతో నిండిన ఆమె పెళ్లికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. By Bhoomi 10 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి David Miller : దక్షణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ తన ప్రేయసి కామిలా హారిస్ ను వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. తాజాగా వారిద్దరూ పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా హారిస్ సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రేమతో నిండిన ఆమె పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. కాగా డేవిడ్ మిల్లర్ వైట్ బాల్ క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతర్జాతీయంగా దక్షిణాప్రియా టీంలో మంచి సభ్యుడిగా మిల్లర్ కు పేరుంది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ టీమ్ లోనూ రాణించాడు. 2022 ఐపీఎల్ సీజర్ టైటిల్ గెలుచుకోవడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. ఇక గతేడాది ఆగస్టు 31వ తేదీని మిల్లర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికపై నిశ్చితార్థం గురించి ప్రకటించాడు. తాను కూడా అంగీకరించింది అంటూ సంతోషాన్ని వెలిబుచ్చాడు. ఇది కూడా చదవండి: వైఎస్ జగన్ సభలో అపశ్రుతి..తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త మృతి.! #south-african-cricketer-david-miller #david-miller-wife #david-miller-girlfriend #camilla-miller #south-africa #camilla-harris #david-miller మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి