Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

సూర్యాపేట జిల్లా కోదాడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగారు. పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు చేపట్టకుండా కుమార్తెలు ఆస్తి పంపకాల కోసం పట్టుపడటంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

New Update
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..

Daughters Fight For Property : ఆస్తుల (Property) కోసం అన్నదమ్ములు హత్య చేసుకుంటున్న ఘటనలు, తోటి కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. కానీ, కుమార్తెలు సైతం ఆస్తుల కోసం వాగ్వాదానికి దిగి తల్లి శవాన్ని అనాథలా చేసిన ఘటన తాజాగా సూర్యాపేట జిల్లా (Suryapet District) లో చోటుచేసుకుంది. కని,పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుమార్తెలు ఆస్తి కోసం పట్టుబట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన వెల్దినేని నాగమణి అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు. వారు వివాహానంతరం అత్తరింటికి వెళ్లిపోయారు. ముగ్గురు కుమార్తెలు.. ఒకరు ఖమ్మం, మరొకరు గుంటూరు, ఇంకొకరు హైదరాబాద్‌ (Hyderabad) లలో నివాసముంటున్నారు. భర్త చనిపోవడంతో నాగమణి ఒంటరిగానే బ్రతికి అనారోగ్యం కారణంగా మృతి చెందింది.

విషయం తెలుసుకున్న కుమార్తెలు ఇంటికి వచ్చి తల్లికి అంత్యక్రియలు చేయకుండా ఆస్తి కోసం పట్టుబట్టారు. పట్టణంలో ఉన్న స్థలం విలువైనది కావడంతో నాకు కావాలంటే నాకు కావాలని ముగ్గురు వాగ్వాదానికి దిగారు. దీంతో పెద్దలు జోక్యం చేసుకొని కుమార్తెల మధ్య గొడవను రాజీ చేయించి దహన సంస్కరాలు పూర్తి చేపించారు.

Also Read : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్‌ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌.!



Advertisment
తాజా కథనాలు