Ring of Fire: ఈ శనివారం ఆకాశంలో అద్భుతం..సూర్య గ్రహణం రోజు ఏం జరగనుందంటే?

ఈ ఏడాది మొత్తం మీద నాలుగు గ్రహణాలు (Grahanam) మాత్రమే శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. రెండు రోజుల్లో మరో గ్రహణం ఏర్పడబోతుంది. ఆ తరువాత రెండు వారాలకు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈసారి అక్టోబర్‌ నెల ఎన్నో ఖగోళ అద్భుతాలకు వేదిక కాబోతుంది.

Ring of Fire: ఈ శనివారం ఆకాశంలో అద్భుతం..సూర్య గ్రహణం రోజు ఏం జరగనుందంటే?
New Update

Ring of Fire Solar Eclipse: ఈ ఏడాది మొత్తం మీద నాలుగు గ్రహణాలు మాత్రమే శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. రెండు రోజుల్లో మరో గ్రహణం ఏర్పడబోతుంది. ఆ తరువాత రెండు వారాలకు చంద్రగ్రహణం (Lunar Eclipse) కూడా ఏర్పడబోతుంది. ఈసారి అక్టోబర్‌ నెల ఎన్నో ఖగోళ అద్భుతాలకు వేదిక కాబోతుంది.

ఆ అద్భుతం ఈ శనివారమే ఏర్పడబోతుంది. ఈ సారి ఏర్పడేది రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ (Ring of Fire). అంటే కంకణాకార గ్రహణం అంటే సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకున్నప్పుడు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతోంది. ఇలా కాకుండా చంద్రుడు తన కక్ష్యలో భూమి నుంచి దాని సుదూర బిందువు వద్ద ఉన్నప్పుడు ఎన్యూలర్‌ సూర్య గ్రహణం ఏర్పడుతోంది.

Also read:''ఆ పిల్లగాడిని మిస్సవుతున్న”..కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

అంటే చంద్రుడు చాలా చిన్నగా కనిపిస్తాడు. చంద్రుడు సూర్యుని వద్ద ఒక డిస్క్‌ మాదిరిగా కనిపిస్తాడు. ఇది ప్రకాశించే రింగ్‌ లేదా '' రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ '' ఏర్పడుతుంది. ఈ శనివారం ఏర్పడే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ మళ్లీ 20 ఏళ్లకే అంటే 2043 లోనే ఏర్పడుతుందని నాసా వివరించింది. ఈ శనివారం గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలోని అనేక దేశా్లో కనిపించనుంది.

నాసా (Nasa) ప్రకారం..గ్రహణం ఉదయం 9: 13 గంటలకు స్టార్ట్‌ అవుతుంది. భారత్‌ లో అయితే రాత్రి 8.34 గంటలకు మొదల..తెల్లవారు జామున 2.25 గంటలకు ముగుస్తుంది. భారత్‌ లో ఈ గ్రహణం కనిపించదు. ఇదిలా ఉంటేఅక్టోబరు 21-22న ఓరియోనిడ్స్ ఉల్కాపాతం కూడా కనువిందు చేస్తుంది. ఇది తిరిగి 2061లో మళ్లీ దర్శనమీయనుంది.

#ring-of-fire-solar-eclipse #ring-of-fire #solar-eclipse #grahanam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe