Dastagiri: వైఎస్ వివేకాను హత్య చేయించింది జగనే.. దస్తగిరి సంచలన వ్యాఖ్యాలు

వివేకాను హత్య చేయించిన జగన్ కు ఓటు అడిగే హక్కులేదని దస్తగిరి షాకింగ్ కామెంట్స్ చేశారు. కడప జైల్లో చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని.. జైల్లోని సీసీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే జై భీమ్ తరపున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

New Update
Dastagiri: వైఎస్ వివేకాను హత్య చేయించింది జగనే.. దస్తగిరి సంచలన వ్యాఖ్యాలు

Dastagiri About Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యాలు చేశారు. వివేకాను హత్య చేయించిన జగన్ (CM Jagan) కు ఓటు అడిగే హక్కు లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే వివేకాను అతి దారుణంగా హత్య చేశారన్నారు. కడప ఎంపీ టికెట్ (Kadapa MP Ticket) కోసం హతమార్చినట్లు తెలిపారు.

వారిదే భాద్యత..

కడపలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి  (Chaitanya Reddy)తనను ప్రలోభాలకు గురి చేశాడని వెల్లడించారు. జైల్లోని సీసీ ఫుటేజీని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. జైల్లో సీసీ కెమెరాలు పని చేసేలా భద్రపరచాల్సిన భాద్యత జైలు అధికారులదే అని చెప్పారు.

Also Read: పీకే బ్రోకర్.. సచివాలయం తాకట్టు పెడితే మీకేంటి? : ధర్మాన కృష్ణదాస్

ప్రలోభాలకు..

కడప జైల్లో ప్రలోభాలపై ఎస్పీ, సీబీఐ ఎస్పీలకు లేఖ రాసినట్లు తెలిపారు. తనను చైతన్య ప్రలోభాలకు గురి చేయడంపై మీడియాలను ఆశ్రయించాలని తన భార్యకు చెప్పానన్నారు. తనను జైల్లోనే చంపేస్తామని తన భార్యను బెదిరించారన్నారు. జైలు అధికారులు కూడా తనను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. పులివెందుల కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి కూడా తన భార్యను బెదిరించారని మండిపడ్డారు.

Also Read: ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన ప్రకటన!

జగన్‌కు హక్కు ఉందా?

వివేకా హత్య వెనక ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy), భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారని, వాళ్ల సూచనలతోనే హత్య జరిగిందని ఆరోపించారు. జై భీమ్ తరపున పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. అయితే, వివేకాను చంపిన తనకు ఓటు అడిగే హక్కు లేదంటున్నారని..కానీ, వివేకాను హత్య చేయించిన జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా? అని అప్రూవర్ దస్తగిరి ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు