ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని వీడడం సంచలనంగా మారింది. అయితే.. కాసేపట్లో పొన్నాల నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లనున్నట్లు సమాచారం. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి (BRS party) ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు జనగాం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మయ్యను జనగాం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కుదరని పక్షంలో ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Big Breaking: కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. ఆ పార్టీలో చేరే ఛాన్స్?
బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఈ విషయమై ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్యతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దాసోజు శ్రవణ్ నిన్న రాత్రే పొన్నాలను కలిసి చర్చించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను గుర్తించి వారికి గులాబీ కండువా కప్పించే బాధ్యతను ఆ పార్టీ నుంచే వచ్చిన దాసోజు శ్రవణ్, కే కేశవరావుకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లోని కీలక నేతలకు ఈ ఇద్దరు నేతలు టచ్ లోకి వెళ్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. పొన్నాలకు టికెట్ ఇస్తే ఇన్ని రోజులు జనగామ అభ్యర్థిత్వం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక వేళ పొన్నాలకు టికెట్ ఇస్తే ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.