Ear Infections: చిన్న పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ల సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. తల్లిదండ్రుల్లో ఆందోళన కూడా పెంచుతుంది. చిన్న చెవిపోటే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని, సరైన వైద్యం అందించాలని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో ఈ సమస్య సర్వసాధారణం కాబట్టి తల్లిదండ్రులు కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టరు. చెవిపోటుపై ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఒక పరిశోధన జరిపారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెవి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఉంటే పిల్లలలో వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని తేలింది.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
చెవి ఇన్ఫెక్షన్ చాలా సాధారణం..కొన్ని సందర్భాల్లో పిల్లల్లో ఎలాంటి చెవి నొప్పి లేకుండా కొంత ద్రవం చెవిలో పేరుకుపోతుంది. అలాంటి సమయంలో లైట్ తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.
అధ్యయనం ఏం చెబుతోంది?
ట్రాన్స్‌లేషనల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన కొందరు పరిశోధకులు 117 మంది పిల్లల వినికిడిపై అధ్యయనం నిర్వహించారు. 5-10 సంవత్సరాల పిల్లలను ఇందులో భాగం చేశారు. చిన్ననాటి నుంచి దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్ల చరిత్ర ఉన్న, ఎలాంటి నొప్పిలేని పిల్లలపై అధ్యయనం చేశారు. చెవి ఇన్‌ఫెక్షన్ ఉన్న పిల్లల గొంతులో మార్పులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాషా అభివృద్ధిని అంచనా వేయడానికి పరిశోధకులు మూడు రకాల పరీక్షలు చేశారు. మొదటి పరీక్షలో పిల్లలు మూడు కార్టూన్ క్యారెక్టర్‌లలో ఒకదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అది మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. రెండవ పరీక్షలో పిల్లలకు కొన్ని ఫోటోలకు పేరు పెట్టమని చెప్పారు. మూడో పరీక్షలో పిల్లలను పదాలను సరిపోల్చమని అడిగారు.
ఇది కూడా చదవండి: ఈ ఆహారాలు తింటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.. అవేంటో తెలుసుకోండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ప్లాస్టిక్ బాటిల్‌ని పారేయకండి..వీటి ప్రయోజనాలు తెలుసుకోండి!