Mushrooms : పుట్టగొడుగులతో ప్రమాదం.. విషపూరితం ఉంటాయి జాగ్రత్త

విషపూరిత పుట్టగొడుగులు మరణానికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. పుట్టగొడుగుల్లో విషం మైసెటిస్ వల్ల వస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. తిన్న తర్వాత 10 గంటల్లోనే ఇలాంటి సమస్యలు కనిపిస్తాయని సూచిస్తున్నారు.

Mushrooms : పుట్టగొడుగులతో ప్రమాదం.. విషపూరితం ఉంటాయి జాగ్రత్త
New Update

Mushrooms : పుట్టగొడుగులు(Mushrooms) ఒక అద్భుతమైన ఆరోగ్య ఆహారం. విటమిన్-డి(Vitamin-D) తో సహా అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. ఇది ఒక రకమైన ఫంగస్. ఆకుపచ్చ ఆకులు లేనందున దీనిని మొక్కగా వర్గీకరించలేం. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుట్టగొడుగులలో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ వీటిలో తినకూడనివి కూడా ఉన్నాయి. విషపూరిత పుట్టగొడుగులు మరణానికి కారణమవుతాయి. పుట్టగొడుగుల్లో విషం మైసెటిస్ వల్ల వస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయి. తిన్న తర్వాత 10 గంటల్లోనే ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి.

పుట్టగొడుగులను కత్తిరించేటప్పుడు:

  • కట్ చేసినప్పుడు పుట్టగొడుగు నుంచి మిల్కీ లేదా అలాంటి ద్రవం వస్తే ఉపయోగించవద్దు. ఈ పుట్టగొడుగును కోసిన వెంటనే రంగు మారితే ఉపయోగించవద్దని నిపుణులు అంటున్నారు. గుండ్రని, డౌనీ క్యాప్ ఉన్న పుట్టగొడుగులు మంచివి.

పుట్టగొడుగు కాండం:

  • విషపూరిత పుట్టగొడుగుల కాండంపై ఉంగరం లాంటి భాగం కనిపిస్తుంది. ఇది అన్నింటిలో జరగదు. తినే పుట్టగొడుగులలో ఈ రింగ్ లాంటి భాగం ఉండదు. అలాగే కాండం దిగువన ఉన్న కప్పు లాంటి భాగం కాండంవైపునకు తిరిగిగే దాన్ని వాడకూడదు.

చక్కని తెల్లటి టోపీలు:

  • తెల్ల పుట్టగొడుగులను(White Mushrooms) తినకపోవడమే మంచిది. పుట్టగొడుగుపై ఉండే టోపీని లాగినప్పుడు సులభంగా చిరిగిపోతే అది విషపూరితం కావచ్చు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.

నిపుణుల సలహా:

  • పుట్టగొడుగులపై అవగాహన ఉన్నవారు వాటిని చూడగానే విషపూరితమైన పుట్టగొడుగులను గుర్తించగలుగుతారు. వర్షం మొదలైన తర్వాత మన పొలాల్లో, చెట్ల కొమ్మల్లో పెరిగే మంచి లేదా చెడు పుట్టగొడుగులను గుర్తించలేకపోతే అనర్థాలు ఉంటాయంటున్నారు. మార్కెట్‌లో అమ్మే వాటిని తీసుకోవాలని చెబుతున్నారు. పుట్టగొడుగులను వండేముందు ఉప్పు, పసుపు కలిపిన నీటిలో బాగా కడిగి వాడాలని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలకు ఏ వయసులో చెవులు కుట్టించాలి?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అర్థరాత్రి చెవి నొప్పి వచ్చిందా.. ఇలా చేయండి

#health-benefits #mushrooms #white-mushrooms
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe