Telangana: వైద్య సిబ్బందికి మరింత భద్రత.. కోల్‌కతా ఘటనతో దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు!

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఉస్మానియా, గాంధీతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

Telangana: వైద్య సిబ్బందికి మరింత భద్రత.. కోల్‌కతా ఘటనతో దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు!
New Update

Damodar Rajanarsimha: కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. CBI కేసును వేగవంతం చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిండుతుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల ప్రిన్సిపల్స్, ఆస్పత్రుల సూపరిoటెండెంట్ లతో డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్ల, వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రత పై శాఖ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కట్టుదిట్టమైన భద్రత..
తెలంగాణలో ఇలాంటి సంఘటనలు జరగకుండా డాక్టర్లు, నర్సుల, వైద్యా, ఆరోగ్యశాఖ సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రత, సంరక్షణకు సంబంధించిన అంశాలను పొందుపరిచినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళల రక్షణ, భద్రతపై ఇప్పటికే 'షీ టీమ్స్' కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా వర్క్ స్టేషన్లలో మహిళ డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన అంశాల పై కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోల్ కతాలో జరిగిన వైద్యురాలి అత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామన్నారు.

#kolkata-trainee-doctor-case #damodar-rajanarsimha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe