Kamareddy : దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు

కామారెడ్డి జిల్లాలో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. నరేష్ అనే వివాహితుడుని రెండో పెళ్లి చేసుకున్న దళిత మహిళపై అతని కుల పెద్దలు, కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. ఆమెను వివస్త్రను చేసి ప్రైవేట్ పార్ట్‌లపై కారంపొడి చల్లి కర్రలతో కొట్టి అక్కాపూర్ లో రాత్రంతా గుంజకు కట్టేశారు.

New Update
Kamareddy : దళిత మహిళపై దారుణం.. నడి బజార్లో నగ్నంగా కట్టేసి కొట్టిన గ్రామ పెద్దలు

Dalit Girl Naked : ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకుందనే అక్కసుతో దళిత యువతి(Dalit Girl) పై కుల పెద్దలు, కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. అమ్మాయిపై భౌతికంగా దాడి చేసిన దుర్మార్గులు అంతటితో ఆగకుండా ఆమెను వివస్త్రను చేసి ప్రైవేట్ పార్ట్‌లపై కారంపొడి చల్లి కర్రలతో కొట్టి ఊరు నడిబొడ్డున కట్టేశారు. ఈ ఆమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అద్దె ఇంట్లోకి చొరబడి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతి, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన సందాని నరేష్ (27)లు రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే గతంలో నరేష్ అక్కాపూర్ గ్రామానికి చెందిన యువతిని సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దళిత యువతిని పెళ్లి చేసుకోగా.. వీరిద్దరూ రామారెడ్డి లో ప్రైవేట్ రైస్ మిల్లులొ కూలి పని చేస్తూ బతుకుతున్నారు. అప్పటికే ఆమెకు ఓ బాబు ఉన్నట్లు సమాచారం. కాగా దానిని మనసులో పెట్టుకొని అద్దె ఇంట్లో ఉంటున్న ఆ దంపతులపై నరేష్‌ బంధువులు, కుల పెద్దలు దాడికి పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి : Telangana : గృహజ్యోతిలో కొత్త రూల్స్..వారికి మాత్రమే పథకం వర్తింపు!

ఇద్దరి బట్టలిప్పి ప్రైవేట్ పార్ట్స్‌లో..
రామారెడ్డికి వెళ్లి వారిని బంధించి ఇద్దరి బట్టలిప్పి ప్రైవేట్ పార్ట్స్‌లో కారప్పొడి చల్లి, కట్టెలతో దాడికి చేశారు. స్పృహ కోల్పోయిన వారిద్దరిని కారులో తీసుకెళ్లి అక్కాపూర్ గ్రామం చౌరస్తాలో గాంధీ విగ్రహం(Gandhi Statue) వద్ద కట్టేశారు. తెల్లవారే దాకా అలాగే ఉంచి కట్లు విప్పారు. తర్వాత మీరు ఎవరికైనా ఈ విషయం చెబితే ఎక్కడికి వెళ్లినా కత్తితో పొడిచి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితులు భయంతో విషయం బయటకు చెప్పలేదు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గుట్ట రట్టు అయింది.

పదివేల రూపాయల లంచం..
దళిత అమ్మాయిని వివస్త్రను చేసి విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన ఘటనపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటి వరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కాగా పోలీసులు గ్రామ పెద్దల నుంచి పదివేల రూపాయల అడ్వాన్స్ తీసుకొని సైలెంట్‌గా ఉండిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించని పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు