Savings Plan: ప్రతిరోజూ రూ. 100 పొదుపు చేస్తే...కోటీశ్వరులు అవ్వడం పక్కా...ఎలాగో తెలుసా?

టీ, కాఫీ, సిగరెట్, స్వీట్స్, సినిమాలు వంటి అనవసరమైన ఖర్చులను తగ్గించి..25 ఏళ్ల నుంచి 65ఏళ్ల వరకు ఎన్‎పీఎస్ లో రోజుకు 100 పెట్టుబడి పెడితే 35ఏళ్లకు 12.60లక్షలు. అసలు పెట్టుబడి మొత్తంపై 35ఏళ్లకు రూ. 1.02కోట్లు కేవలం వడ్డీగా లభిస్తుంది.

Super Scheme: కేవలం రూ. 65 పొదుపు చేస్తే మీ అకౌంట్లోకి రూ. 16లక్షలు. సర్కార్ అదిరిపోయే స్కీమ్..పూర్తివివరాలివే..!!
New Update

చాలా మంది డబ్బు సంపాదించేందుకు పగలు రాత్రిళ్లు కష్టపడుతుంటారు. కానీ రిటైర్మెంట్ వయస్సు వచ్చేసరికి చాలా తక్కువ లేదా అసలు ఎలాంటి సేవింగ్స్ లేకుండా మిగిలిపోతారు. అప్పుడు బతుకు భారం అయితుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతుంటాయి. ఇలాంటి భవిష్యత్తు వద్దనుకునేవారు కాంపౌండింగ్ ఎఫెక్ట్ కు ఉన్న పవర్ ఎంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పవర్ ఫుల్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్ అనేది కాలక్రమేణా భారీ మొత్తంలో సంపదను కూడగట్టుకోవడంలో పెట్టుబడిదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

చిన్న మొత్తాలే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి:
కాంపౌండింగ్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ పై మాత్రమే కాదు..వడ్డీపై వడ్డీని సంపాదించి పెడుతుంది. ఇది డబ్బును సాధారణ వడ్డీ కంటే వేగంగా పెంచేలా చేస్తుంది. కాంపౌండింగ్ తో ప్రతిరోజూ కేవలం రూ. 100 ఆదా చేసి పెట్టుబడి పెడితే..సులభంగా కోటీశ్వరులుగా మారుతారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ సేవింగ్స్ ఆప్షన్ గురించి చూద్దాం:
25సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుంచి రోజుకు రూ. 100 ఆదా చేయాలి. ఇంత మొత్తం డబ్బు సేవ్ చేసేందుకు టీ, కాఫీ సిగరెట్, స్వీట్స్, సినిమాలు వంటి అనవసరమైన ఖర్చులను తగ్గించాలి. బదులుగా ఆ డబ్బును ఆదా చేయాలి. ప్రతినెలా నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ లో పెట్టుబడి పెట్టాలి. ఈ ఫండ్స్ సగటున 10శాతం యన్యువల్ రిటర్న్స్ అందిస్తాయి. ఫైనాన్షియల్ గోల్స్ రిస్క్ భరించాల్సిన సామార్థ్యాన్ని బట్టి పెట్టుబడి ఆప్షన్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ కాలిక్యులేటర్లు, యాప్స్ ను ఉపయోగించి ఏ ఇన్వెస్ట్ మెంట్ బెస్ట్ గా ఉంటుందో తెలుసుకోవచ్చు.

ప్రతిరోజూ రూ. 100 ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలి..?
సాధారణంగా భారత్ లో రిటైర్ మెంట్ వయస్సు 60ఏళ్లు. 25ఏళ్ల నుంచి రిటైర్ మెంట్ వయస్సు 60ఏళ్ల వరకు రోజు రూ. 100 అంటే నెలకు రూ. 3000( రూ. 100x30 రోజులు) పెట్టుబడి పెట్టాలి. ఈ లెక్కన చూస్తే మొత్తం రూ. 12. 60లక్షలు ( రూ. 3000x12 నెలలుx35ఏళ్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

35ఏళ్లు పొదుపు చేస్తే..?
35 సంవత్సరాలు పొదుపు చేస్తే చివరికి ఏకంగా మీరు అక్షరాలా రూ. 1.15 కోట్లు అందుకుంటారు. ఎందుకంటే కంపౌండింగ్ పద్దతిలో వడ్డీ అనేది ఊహించని రీతిలో లభిస్తుంది. రూ. 12.60లక్షలు అసలు అయితే 35ఏళ్లకు రూ. 1.02కోట్లు కేవలం వడ్డీగా లభిస్తుంది. అంటే పెట్టుబడి పెట్టిన మొత్తానికి డబుల్ కాదు త్రిబుల్ కాదు ఏకంగా 8 రెట్లు ఎక్కువగా వడ్డీని పొందవచ్చు. ఈ విధంగా తెలివిగా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ తర్వాత కోటీశ్వరులు అవుతారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చివరి రోజులు సంతోషంగా గడపవచ్చు. ఇంకేందుకు ఆలస్యం ఆరోజే పొదుపు చేయడం ప్రారంభించండి. కావాల్సిందల్లా ఓర్పు, తెలివైన ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ. ఇవి మీకు ఎలాగో ఉన్నాయ్...కాబట్టి వెంటనే ప్రారంభించి...కోటీశ్వరులు అవ్వండి.

ఇది కూడా చదవండి: ISI బంపర్ రిక్రూట్‌మెంట్..జీతం రూ. 2లక్షలకు పైనే…పూర్తి వివరాలివే..!!

#business #finance #money-savings #savings-plan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe