Rose water: వేసవిలో మీ ముఖానికి రోజూ దీన్ని అప్లై చేయండి.. తేడా గమనించండి!

వేసవి కాలంలో రోజ్ వాటర్ ముఖానికి రాస్తే చర్మం ప్రకాశవంతం ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజ్ వాటర్‌ ముఖంలోని మురికిని తొలగించి మెరిసేలా చేస్తుంది.

Rose water: వేసవిలో మీ ముఖానికి రోజూ దీన్ని అప్లై చేయండి.. తేడా గమనించండి!
New Update

Rose water: రోజ్ వాటర్ ఉపయోగించడం ద్వారా ముఖాన్ని అందంగా, మెరిసేలా చేసుకోవచ్చు. ఇది వేసవి కాలంలో చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు వేసవిలో పింక్, మృదువైన చర్మాన్ని పొందాలనుకుంటే ముఖానికి రోజ్ వాటర్‌ని ఉపయోగించవచ్చు. దానిని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ముఖానికి రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  • రోజ్ వాటర్‌ను రోజూ ముఖానికి రాసుకుంటే ముఖంలోని మురికిని తొలగించడంలో ఇది చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది.
  • రోజ్ వాటర్ సహాయంతో చర్మం చల్లదనం, తాజాదనాన్ని పొందుతారు. ఇది వేసవి కాలంలో చాలా ముఖ్యమైనది.
  • రోజ్ వాటర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • మాయిశ్చరైజర్ అప్లై చేసే ముందు రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది మొటిమలను తొలగిస్తుంది.
  • కొంతమందికి రోజ్ వాటర్‌కి అలెర్జీ ఉండవచ్చు. దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఎమైనా ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: రోజుకు ఎన్నిసార్లు స్క్రబ్ చేసుకోవచ్చు? ఈ తప్పు చేస్తున్నారా?

#rose-water
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe