Miheeka Bajaj : పెళ్లి రోజు రానా భార్య ఎమోషనల్ పోస్ట్.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదంటూ!

దగ్గుబాటి రానా భార్య మీహికా.. తమ నాలుగో యానివర్సరీ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు' అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

New Update
Miheeka Bajaj : పెళ్లి రోజు రానా భార్య ఎమోషనల్ పోస్ట్.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదంటూ!

Daggubati Rana's Wife Miheeka Emotional Post On There 4th Wedding Anniversary : టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) భార్య మీహిక బజాజ్‌ (Miheeka Bajaj) తమ నాలుగో యానివర్సరీ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు తన పోస్ట్ లో..' జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. సముద్రమంత మార్పులు వచ్చినా ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది.

నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు' అని రాసుకొచ్చారు. అలాగే రీసెంట్ గా విదేశాల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోను జత చేశారు. ఈ పోస్ట్ చూసిన దగ్గుబాటి ఫ్యాన్స్, నెటిజన్స్ రానా - మిహికా జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 'మీరెప్పటికీ ఇలాగే కలిసుండాలి' అని కోరుకుంటున్నారు.

Also Read : ‘సరిపోదా శనివారం’ స్టోరీ లీక్ చేసిన SJ సూర్య.. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్న ఫ్యాన్స్..!

కాగా వీరిద్దరూ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. ఇక రానా సినిమాల విషయానికొస్తే.. ఓవైపు నిర్మాతగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రెజెంట్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టైయన్' మూవీలో నటిస్తున్నాడు. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : పెళ్లి రోజు రానా భార్య ఎమోషనల్ పోస్ట్.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదంటూ!

#tollywood #Rana Daggubati #miheeka-bajaj
Advertisment
తాజా కథనాలు