Politics: వివాద రహిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్..దగ్గుబాటి పురంధరేశ్వరి వాక్ చాతుర్యం, వివిధ భాషాలపై పట్టు ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం అతి కొద్ది మందికే సాధ్యం. అందులో ముందు వరుసలో ఉంటారు దగ్గుబాటి పురందేశ్వరీ. ఆమె ఫాలోయింగ్ చూసి నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఆశ్యర్యపోయారని మీకు తెలుసా? అసలు పురందేశ్వరీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? By Manogna alamuru 22 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Special Story On Daggubati Purandeswari : ఓ సారి 2023 జులై ముందు నాటి విషయాలను గుర్తు చేసుకుందాం. ఏపీ(Andhra Pradesh) లో బీజేపీ(BJP) తన ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రోజులవి. ఏపీ బీజేపీ చీఫ్‌గా గతంలో అనేకమంది బాధ్యతలు చేపట్టిన పార్టీకి పెద్దగా మైలేజ్ రాలేదు. ఆ సమయంలోనే పార్టీ చీఫ్‌ను మార్చాలని హైకమాండ్ గట్టిగా డిసైడ్ అయ్యింది. ముందుగా సుజనాచౌదరి అనుకున్నారు.. తర్వాత సత్యకుమార్ అన్నారు.. కానీ ఏపీ బీజేపీ చీఫ్‌గా 2023 జులై 4న పురందేశ్వరి(Purandeswari) ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. వాక్ చాతుర్యం ఎక్కువ... క్రికెట్లో కంకషన్ ప్లేయర్ తరహాలో ఆమె సడన్ ఎంట్రీ ఏపీ బీజేపీలో ఆనాడు ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి. ఎందుకంటే దెబ్బతగిలి ఉన్న ఆటగాడి స్థానంలో కంకషన్ ప్లేయర్ ఎలా అయితే బరిలోకి దిగుతాడో.. పురందేశ్వరి కూడా అలానే ఎదురుదెబ్బలు తగిలున్న పార్టీని నిలబెట్టేందుకు రంగంలోకి దూకారు. ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. పురందేశ్వరి మాటల్ని పొదుపుగా వాడతారు. మాస్‌ని అట్రాక్ట్ చేస్తారు. వాక్ చాతుర్యం ఎక్కువ. అన్నీటికంటే ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలతో ఆమెకు చాలా మంచి సంబంధాలున్నాయి. అటు కాంగ్రెస్‌తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. మన్మోహన్సింగ్ కేబినెట్లో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఆమె సొంతం. ఇలా ఏ విధంగా చూసిన పురందేశ్వరి ఈ పొజిషన్‌కి సరిపోతారని బీజేపీ పెద్దలు భావించారు. అందుకే ఆమెకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు. ఎన్టీయార్ కూతురుగా పరిచయం.. ఎన్టీఆర్(NTR), బసవతారకంల కూతురు పురందేశ్వరీ. 1959లో ఏప్రిల్ 22న ఆమె చెన్నైలో జన్మించారు. పురందేశ్వరీకి చిన్నతనంలో నాట్యంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది, కూచిపూడి లాంటి సాంప్రదాయ నృత్యాలను ఆమె నేర్చుకున్నారు. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ విమెన్ కాలేజీలో బీఏలో లిటరేచర్ పూర్తి చేసిన పురందేశ్వరీ.. ఆ తర్వాత గేమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరి గేమాలజీ కంప్లీట్ చేశారు. దగ్గుబాటి కోడలిగా ఫేమస్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పురందరేశ్వరి వివాహం 1979 మే 9న జరిగింది. 1985లో పురందేశ్వరీ తల్లి బసవతారకమ్మ కన్నుమూశారు. అప్పటికీ టీడీపీ పార్టీ ఏపీలో రూలింగ్‌లో ఉంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత పరిణామాలు నిదానంగా మారుతూ వచ్చాయి. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవాడాన్ని పురందేశ్వరీ వ్యతిరేకించారంటారు రాజకీయ నిపుణులు. చంద్రబాబు పక్షాన నిలబడి 1995లో నాటి వైస్రాయ్ ఘటనలో ఎన్టీఆర్ గద్ద దిగిపోవడానికి పురందేశ్వరి కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఆ తర్వాత చంద్రబాబుతో విబేధాల కారణంగా పురందేశ్వరి- వెంకటేశ్వర్లు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. 1999లో కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్‌ను ఆశ్చర్యపరిచిన పురంధరేశ్వరి.. రాజకీయాల్లో చేరిన తర్వాత పురందేశ్వరీ క్రేజ్ అమాంత పెరిగింది.. ఆమె ఫాలోయింగ్ చూసి నాడు వైఎస్సార్‌తో పాటు రాజశేఖర్ రెడ్డి సైతం ఆశ్చర్యపోయేవారట. అందుకే 2004 ఎంపీ అభ్యర్థిగా వెంకటేశ్వర్లను కాకుండా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి రామానాయుడుకి పోటిగా పురందేశ్వరీని రంగంలోకి దించారు. ఈ ఎన్నికల్లో పురందేశ్వరీ గెలుపొందారు. 2004-2005 బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న పురందేశ్వరీ పనితీరు పట్ల సోనియాగాంధీ మెస్మరైజ్ అయ్యారు. అందుకే మన్మోహన్ క్యాబినెట్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆమెను నియమించారు. 2009లో విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వరీ ఆ తర్వాత మరోసారి మన్మోహన్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు పురందేశ్వరీ! Also Read:Viral Video: ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్ #ntr-daughter #ap-bjp #andhra-pradesh #daggubati-purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి